తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ఆయనకు స్క్రిప్ట్ 10 జన్ పథ్ నుంచే వస్తుందని విమర్శించారు.. రాఫెల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది… అవినీతి జరగలేదని చెప్పింది… కేసీఆర్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే అన్నారు… కేసీఆర్ పీసీసీ చీఫ్ అవుతాడు… కాంగ్రెస్ నేతలరా మీ లీడర్ ఇక కేసీఆరే అంటూ సెటైర్లు వేశారు.. తాజాగా కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బండి సంజయ్.. సీఎం కేసీఆర్.. చైనా మీద బాగా ప్రేమ చూపుతున్నాడు.. సీఎంకి ఏమి పుట్టిందో అర్థం కావడం లేదు… నిస్సిగ్గుగా వీర సైనికుల త్యాగాలను కించ పరిచేగా మాట్లాడారు.. కేసీఆర్ అంత దేశ ద్రోహి ఎవరు లేరు అని మండిపడ్డారు..
కేసీఆర్ ఇక్కడే పుట్టాడా…? అని ప్రశ్నించిన బండి సంజయ్.. డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలి… ఏ దేశానికి వంత పాడుతున్నారు అంటూ మండిపడ్డారు.. మసూద్ అజహర్ చెబితే కేసీఆర్ నమ్ముతాడట… అని ఎద్దేవా చేసిన ఆయన.. దేశంపై జరిగిన అనేక ఉగ్ర దాడులకు కారణం మసూద్ అజహర్… కేసీఆర్ నీవు భారతీయునివి అయితే వెంటనే నువ్వు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పు అని డిమాండ్ చేశారు.. తెలంగాణ యువత సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా…? అని ప్రశ్నించిన ఆయన.. రాజకీయ విమర్శలు చేయి.. కానీ, సైనికులను అవమానిస్తావా? అని మండిపడ్డారు.