రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఈ పర్యటనలో అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం) ను సందర్శించనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. ఇక ఎల్లుండి (16.11.2021) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్ కుమార్. మార్కెట్ లో…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనే ముఖ్య డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం నాగేందర్.. తన నియోజక వర్గం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం…
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరని చెబుతుంటారు.. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత.. తెల్లారేసరికి మరో పార్టీలో కనిపించి ఆశ్చర్య పరిచిన సందర్భాలు ఎన్నో చూశాం.. అయితే, తెలంగాణలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ.. కానీ, సీఎం కేసీఆర్‌కు చివరకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నా ఫామ్‌హౌస్‌ను ట్రాక్టర్ పెట్టి దుంతాడట.. రా వచ్చి చూడు.. ఆరు ముక్కలు…
తెలంగాణ ప్రభుత్వం పథకాలకు ఖర్చు చేసే ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తుందంటూ పలు సందర్భాల్లో బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు.. ఒక, గొల్ల కురుమల కోసం ప్రభుత్వం అందిస్తున్న గొర్రెల పంపిణీ పథకంలోనూ కేంద్రం నిధులున్నాయని విమర్శించింది బీజేపీ.. అయితే, గొర్రెల పంపిణీ పథకంలో ఒక్క పైసా కేంద్రం వాటా ఉన్నా సీఎం పదవీకి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన…
మరోసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. వరుసగా రెండోరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో నిజాలు మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన మాట్లాడేవారిపై దేశద్రోహిగా ముద్ర వేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహి.. బిల్లులకు పార్లమెంట్‌లో సహాయం కోరినప్పుడు కేసీఆర్ దేశద్రోహికాడు..! రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపినప్పుడు కేసీఆర్ దేశద్రోహి కాదు..! కానీ, ఎవరు గట్టిగా మాట్లాడినా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశద్రోహి అవుతారని వ్యాఖ్యానించారు…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హుజురాబాద్ గెలుపు.. ప్రజల గెలుపు అన్నారు. ఈటల రాజేందర్ పై ఎన్ని కుట్రలు చేసినా… చివరికి తామే గెలిచామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ పేరుతో తప్పించుకున్నారని… దళిత బంధు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నిగ్ ఇచ్చారు. దళిత బంధు…
ఒకాయన నన్ను కోతి అంటున్నరు. టీఆర్ఎస్ ను చూసి కోతులన్నీ భయపడి పోతున్నయ్. ఎందుకంటే గుంట నక్కలు, దండు పాళ్యం ముఠా లెక్క జనంమీద పడి దోచుకుంటున్నరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ కొదమ సింహం లాగా అడ్డుకుని కొట్లాడి తీరతడు.వచ్చేనెల 2న కేసీఆర్ కు ప్రగతి భవన్ లో ‘ట్రిపుల్ ఆర్ ’ సినిమా చూపిస్తాం. 30న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకే అందరూ ఓటేయ్యాలి.…
సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. దళిత బంధుపై ఎవరి నిజాయితీ ఏందో యదాద్రిలో తేల్చుకుందాం.. దమ్ముంటే అక్కడికి రావాలని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దళిత బంధు ఆపాలని బీజేపీ ఎక్కడా లేఖలు ఇవ్వలేదన్నారు. ఇవాళ హుజురాబాద్ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస ఇచ్చే 20 వేలు తీసుకుని.. ఓటు మాత్రం బీజేపీకి వేయాలని కోరారు.…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవలే పూర్తి చేసుకున్న సంజయ్, ఇప్పటికే ఒకసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ప్రచార వ్యూహం రూపొందించారనీ… అందుకు అనుగుణంగా నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం మరింత ఉధృతం చేయనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి.…
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అని నిరుద్యోగ అభ్యర్థులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ లో 704 పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ ఏడాదిన్నరగా జాప్యం జరుగుతుండటంపట్ల ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అంశాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా ఒత్తిడి తెస్తానని సమగ్ర శిక్ష అభియాన్ పరీక్ష రాసి ఫలితాల…