రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నిరసనకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా ఉన్న 317 జీఓను ఉపసంహరించుకునేలా రేపు రాత్రంతా కరీంనగర్‌లో జాగరణకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో రేపు (జనవరి 2) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు (జనవరి 3) ఉదయం 5 గంటల…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బృందం గవర్నర్ తమిళసైని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ ని సవరించాలన్నారు. ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు. సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా…
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలని… నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు బండి సంజయ్. ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ (సర్దుబాటు) కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ కు మధ్య విభేధాలు ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాల్లో, వార్త ఛానెళ్లలో న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వార్తలపై స్వయంగా ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తనకు బండి సంజయ్ మధ్య ఎలాంటి పోటీ ఏమి లేదని…. ఇక్కడ ఏమన్నా సీఎం, మంత్రి పదవులు ఉన్నాయా… నేను ఎప్పుడు గ్రూప్ లు కట్టలేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.…
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 317పై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందన్న ఆయన.. ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనం అని మండిపడ్డారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. సీఎం కేసీఆర్.. సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయలబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని విమర్శించారు..…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. రెండు రోజుల కిందట అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ నేపథ్యంలోనే… బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు (09.12.2021 గురువారం) అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నల్గొండ పర్యటనలో జరిగిన దాడిపై నేడు గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ నల్లొండలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. అయితే దీనిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుపుతూ గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. గ్రామాల్లోకి వెళ్లి రైతుల బాధలు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అడుగడుగునా బండిని అడ్డుకోవడం.. వాగ్వాదాలు, తోపులాటలు, రాళ్ల దాడులు, కోడిగుడ్లు విసరడం లాంటి ఘటనలు చర్చగా మారాయి.. అయితే.. ఈ పరిణామాలపై స్పందించిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బండి సంజయ్‌ని తిరగనిస్తాం అన్నారు.. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం… వేటాడుతామన్న ఆయన.. నల్గొండ రైతులపై దాడులు చేసిన…
రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఈ పర్యటనలో అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం) ను సందర్శించనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. ఇక ఎల్లుండి (16.11.2021) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్ కుమార్. మార్కెట్ లో…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనే ముఖ్య డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం నాగేందర్.. తన నియోజక వర్గం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం…