తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలంగాణప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం…
KTR: వ్యక్తులకు ఇగో ఫీలింగ్ ఉంటుంది. ఓ రేంజ్‌లో ఉన్నోళ్లు కూడా దీన్ని ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పేరును పూర్తిగా ప్రస్తావించరు. వైకాపా అని గానీ వైసీపీ అని గానీ క్లుప్తంగా అంటుంటారు. కేటీఆర్ బండి సంజయ్ కుమార్ పేరును షార్ట్ కట్‌లో "బీఎస్ కుమార్" అని వెరైటీగా రాశారు.
నేటి నుంచి పల్లె గోస- బీజేపీ భరోసా యాత్రను చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ముందు ఆరు నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు కలిపి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో 13 నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నేడు(గురువారం) 6 నియోజకవర్గాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.…
రాజ్యసభ ఎంపీగా కే. లక్ష్మణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగానే కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్ష్ పాండేను కలిశారు. వారితో తాను తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్ అసోసియేషన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భారతదేశం, తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రం చర్చించకపోవడం బాధాకరమని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సమాజంపై ముప్పేట దాడి చేసేందుకు ఈ సమావేశాల్ని బీజేపీ వాడుకుందని ఆరోపించారు. తెలంగాణ పట్ల ప్రధానికి ఉన్న కక్ష తగ్గి, అభివృద్ధి పథకాలతో పాటు నిధులు ప్రకటిస్తారనుకున్నామని.. కానీ నిరాశే మిగిలిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే మోదీ పారిపోయారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా…
కేసీఆర్ ఎవరు కౌన్ కిస్కా.. అంటూ.. బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నగరంలో పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్ వీడ్కోలు పలికిన అనంతరం ఎయిర్‌పోర్టులో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని , బీజేపీ.. కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని…
ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్పై సైతం ఆ పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని,…