Bandi Sanjay Kumar: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6 గ్యారంటీలు ఇస్తామని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? మాట తప్పిన కాంగ్రెస్ నేతలపై విజిలెన్స్ దాడులు చేస్తారా?
ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖైదీలకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు వడ్డీలేకుండా రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదవిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ ను అభినందించకుండా ఉండలేమన్నారు. కస్టడీ-కేర్-కరక్షన్ కు…
Bandi Sanjay Kumar: తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు…
Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో “సైకిళ్ల పంపిణీ” కార్యక్రమం నిర్వహించబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తిని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్ అన్నారు. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్ కు ఇది చిన్న ఉదాహరణ…
Bandi Sanjay Kumar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేపట సేవా కార్యక్రమాల్లో భాగంగా.. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పిల్లల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా, ప్రధానమంత్రి మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. ముఖ్యంగా టెన్త్ తరగతి చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ స్వయంగా సైకిళ్లను అందజేస్తున్నారు. తొలిరోజు కరీంనగర్ టౌన్…
Bandi Sanjay Kumar: దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతోందని, అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే ఈ సర్వేలో కులాల వారీగా ఎంత…
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయనను కలిసి గ్రూప్-1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతోపాటు ఆ నియామకాలను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాలని కోరుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గ్రూప్-1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు…
బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు.
ఉద్యోగాల కోసమని వెళ్లి థాయ్లాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మొత్తం 540 మంది బందీలను గుర్తించగా వీరిలో తెలంగాణ, ఏపీకి చెందిన 42 మందిని గుర్తించారు. వీరందరినీ 270 మంది చొప్పున రెండు విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు…
బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదని తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని, ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాల్సిందే అని, ఎన్నికల హామీ మేరకు…