కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ఉగాది వరకు డెడ్‌లైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డ ఆయన.. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న ఈ తరుణంలో వాటిని దారి మళ్లించేందుకే ప్రధానమంత్రి గారికి బహిరంగ లేఖ పేరిట మీరు కొత్త డ్రామాకు తెరదీసినట్లు కన్పిస్తోంది అని ఎద్దేవా చేశారు.. ఇక, సీఎం ముందు కొన్ని డిమాండ్లను పెట్టిన బండి సంజయ్.. వాటిని ఉగాది వరకు అమలు చేయాలి.. లేకుంటే ఉద్యమం చేస్తామని డెడ్‌లైన్ పెట్టారు..
Read Also: తెలంగాణ, ఆంధ్ర సీఎంలు కలిసి రావాలి..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
బండి సంజయ్ డిమాండ్లు ఇలా ఉన్నాయి..
- 2017 ఏప్రిల్ 13న మీరు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలి.
- ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి.
- వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున ‘బోనస్’ ప్రకటించాలి.
- కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడంతోపాటు పంటల ప్రణాళికను ప్రకటించాలి.
- వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలి. పార్టీ కార్యకర్తలకు గాకుండా అర్హులైన రైతులకు మాత్రమే వాటిని అందించాలి.
- గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్దరించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్‌ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలి.
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.
- విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేయాలి. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలి.
- అకాల వర్షాలకు నష్టపోతున్న రైతాంగానికి ఆదుకునేందుకు ‘క్రాప్ ఇన్సూరెన్సు’ పథకాన్ని అమలు చేయాలి.
- మార్కెట్‌లో ‘ఈ-నామ్’ పద్దతిని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలి.
- బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. అని డిమాండ్ చేశారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!