కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కి ఊరట లభించింది. ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరీంనగర్ జైలులో వున్న బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.
బండి సంజయ్ తరపు వాదనలు వినిపించారు దేశాయ్ ప్రకాశ్ రెడ్డి. పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం 317 జీవో రద్దు చేయాలనీ దీక్ష తలపెట్టారని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదించారు. పోలీసులు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో చెదర కొట్టాలని చూస్తే ఆస్తులను ధ్వసం చేసారని, కొట్టారని పోలీసులు చెబుతున్నారు. మొదటి ఎఫ్‌ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ 333 గా మార్చారని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి అన్నారు.
ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ శ్రీనివాస్ ఎంపీ బండి సంజయ్ ని అరెస్ట్ చేసారు. 10.50 అరెస్ట్ చేసి 11.15 కు శ్రీనివాస్ నమోదు చేశారు. మేజిస్ట్రేట్ జ్యూడిషియల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైంది కాదన్నారు దేశాయ్ ప్రకాశ్ రెడ్డి. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్ కు ఆదేశాలివ్వడం సరికాదని పేర్కొంది కోర్ట్, రిమాండ్ రీపోర్ట్ సరికాదంది హైకోర్టు. పర్సనల్ బాండ్ రూ.40.000 పై బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 7 కు వాయిదా వేసింది హైకోర్టు.