Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన రామ మందిరాన్ని సందర్శించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అయోధ్య యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్‌లో రామ మందిర నిర్మాణం, జనవరి 22 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ…
Ram Mandir: అయోధ్య రామ మందిరాన్ని ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ గురువారం సందర్శించారు. అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ ప్రధాని నిలిచారు. గత నెల 22న అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఫిజీలో భారతీయ ప్రవాసులకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధి బృందానికి బియన్ ప్రసాద్ నాయకత్వం వహించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్లిన ప్రధాని, అక్కడ ర్యాలీలో మాట్లాడారు. స్వాతంత్ర్యానంతరం అధికారంలో ఉన్న వారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని, తమ సంస్కృతిని, గతాన్ని చూసి సిగ్గు పడ్డారని ఆదివారం అన్నారు. రాజకీయ, సొంత ప్రయోజనాల కోసం తమ స్వంత సంస్కృతి మరియు చరిత్ర గురించి సిగ్గుపడే ధోరణిని ప్రారంభించారని,
British MP: అయోధ్య రామ మందిరంపై బీబీసీ పక్షపాత కవరేజ్‌పై బ్రిటిష్ ఎంపీ బాబా బ్లాక్‌మన్ ధ్వజమెత్తాడు. జనవరి 22న జరిగిన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు సంబంధించి బీబీసీ తీరు సరిగా లేదని అన్నారు. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో దానికి తగిన రికార్డుల్ని అందించాలని అన్నారు. యూకే పార్లమెంట్‌లో మాట్లాడిన బాబ్ బ్యాక్‌మన్.. 2000 ఏళ్లకు పైగా దేవాలయం ఉన్న విషయాన్ని మరిచిపోయి, మసీదు ధ్వంసం చేసిన ప్రదేశం అంటూ అయోధ్య రామ…
Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా పండగ రీతిలో అయోధ్య రామమందిరం ఈ నెల 22 ప్రారంభమైంది. అయితే, అద్భుత రీతిలో నిర్మించిన ఈ ఆలయం 2500 ఏళ్లలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకునేలా రూపొందించారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CBRI)-రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అయోధ్య సైట్‌కి సంబంధించి జియోఫిజికల్ క్యారెక్టరైజేషన్, జియోటెక్నికల్ అనాలిసిస్, ఫౌండేషన్ డిజైన్ వెట్టింగ్ మరియు 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ మరియు డిజైన్‌తో సహా అనేక శాస్త్రీయ…
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ.. పాకిస్తాన్ భారత్‌పై విషప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలో రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ, ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెబుతోంది.
Ayodhya : రామనగరి అయోధ్యలో నిర్మించిన గొప్ప ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. చలికాలంలో మందకొడిగా సాగుతున్న వ్యాపారానికి ఈ కార్యక్రమం కొత్త ఊపు వచ్చింది.
Ayodhya : రామ మందిరం తర్వాత అయోధ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. త్వరలో అవధానగరి అయోధ్య ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారనుంది.