Asaduddin Owaisi: దేశానికి మోడీ బాబా అవసరం లేదు.. పార్లమెంట్‌లో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్‌లో రామ మందిర నిర్మాణం, జనవరి 22 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్ ఏం చేశాడు? వారికి సమాధానమే ఈ ప్రజాహిత యాత్ర
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ఈ దేశానికి మతం లేదని నేను నమ్ముతున్నానని, జనవరి 22 ద్వారా ఈ ప్రభుత్వం ఒక మతం మరొక మతంపై గెలించిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా..? దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారంటూ మండిపడ్డారు. నేను బాబార్, జిన్నా లేదా ఔరంగాజేబు ప్రతినిధినా..? నేను రాముడిని గౌరవిస్తాను, అయితే నేను నాథురామ్ గాడ్సేను ద్వేషిస్తాను, ఎందుకంటే హే రామ్ చివరి మాటలుగా ఉన్న వ్యక్తిని అతను చంపాడు అని అసదుద్దీన్ అన్నారు.
మితవాద సంస్థలు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు డిసెంబర్ 6, 1992 తర్వాత దేశంలో అల్లర్లు జరిగాయని ఓవైసీ అన్నారు. యువకులను జైలులో పెట్టారని, వారు వృద్ధులైన తర్వాత బయటకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైసీ తన ప్రసంగానికి ముగించడానికి ముందు ‘‘బాబ్రీ మసీదు జిందాబాద్.. బాబ్రీ మసీదు ఉంది, ఎప్పటికీ ఉంటుంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!