Ayodhya Dham: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ధామ్, పంచకోసి పరిక్రమ మార్గాల్లో మాంసాహారాన్ని నిషేధించింది. ఈ చర్య ద్వారా ఆ ప్రాంతంలో మతపరమైన, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది. మాంసాహార అమ్మకాలు దుకాణాల్లో, హోటళ్లలో, రెస్టారెంట్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ డెలివరీ అప్లికేషన్‌లకు కూడా వర్తిస్తుంది. దీంతో పాటు గెస్ట్‌హౌజులు, హోమ్ స్టేలలో కూడా నాన్ వెజ్ వడ్డించడాన్ని…
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దివ్యమైన, అద్భుతమైన మందిరంలో రాముడి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికం అనుభవం ఉత్తేజకరంగా ఉందని ఆయన పేర్కన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు అన్నారు. అవి ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ, ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. Palnadu: పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ పంచాయితీలు.. స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్యాయత్నం..! ముఖ్యమంత్రి చంద్రబాబు…
Yogi Adityanath: గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మహంత్ దిగ్విజయనాథ్ 56వ వర్ధంతి మరియు మహంత్ అవైద్యనాథ్ 11వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ‘‘ ఈరోజు భారతదేశంలో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గొప్ప ఆలయాన్ని చూసి ఎవరు గర్వపడరు..? ఎవరైనా గర్వంచకపోతే, వారు భారతీయులనేది సందేహమే’’ అని ఆదిత్యనాథ్ అన్నారు. Read Also: Bellamkonda : కిష్కింధపురి లాంటి హారర్ సినిమా అందరితో కలిసి థియేటర్స్ లో చూడండి…
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ‘శ్రీరామ నవమి’ 2025 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతోన్న రెండో వేడుకలు ఇవి. స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’తో భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని…
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు.
Milkipur Bypoll: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఉంది. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలోనే అయోధ్య రామమందిరం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అవధేశ్ ప్రసాద్ గెలుపొందారు.
Ram Mandir: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరి ఏడాది గడిచింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Ayodhya: అయోధ్య రామమందిర దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి అనుమానస్పదంగా ప్రవర్తించాడు. అతడు ధరించిన కళ్లద్దాల్లో కెమెరాను దాచి ఉంచాడు. ఈ గ్లాసెస్ ధరించి కాంప్లెక్స్‌ని వీడియో, ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఆలయ ప్రాంగణంలో భద్రతా చర్యలను ఉల్లంఘించినందుకు సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గుజరాత్ వడోదరకు చెందిన జయకుమార్‌గా పోలీసులు గుర్తించారు.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చిందని, ఇందుకు అయోధ్ నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Rahul Gandhi: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ‘‘నాచ్ గానా( సాంగ్స్-డ్యాన్స్)’’ కార్యక్రమం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.