Ayodhya Ram Temple: రామమందిరంపై యూఎన్‌కి పాకిస్తాన్ మొర.. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోగలదా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ.. పాకిస్తాన్ భారత్‌పై విషప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలో రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ, ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెబుతోంది.
అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని యావత్ దేశం పండగలా జరుపుకుంది. దీన్ని చూసిన పాక్ తట్టుకోలేకపోతోంది. తాజాగా రామ మందిర నిర్మాణంపై ఐక్యరాజ్య సమితి(యూఎన్)లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ అధికారికంగా యూఎన్‌కి లేక రాసింది. రామ మందిరంపై ఐక్యరాజ్య సమితితో మొరపెట్టుకుంది. తినడానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా కూడా పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ని అభాసుపాలు చేసే పనులు చేస్తోంది.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Read Also: PM Modi: నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వానికి ప్రధాని మోడీ అభినందనలు..
యూఎన్‌కి పాక్ ఏమని ఫిర్యాదు చేసింది..?
భారత్‌లో బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి, ప్రతిష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూఎన్‌కి పంపిన లేఖలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ రాశారు. ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం, శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆరోపించారు. భారత్ ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణను నిర్ధారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్‌లో ఇతర మసీదులు కూడా ఇదే రకమైన బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని, వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు మరియు మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు కూడా అవమానాలు, విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో పాక్ పేర్కొంది. అయితే, ఇది భారత అంతర్గత విషయం కాబట్టి యూఎన్ ఇందులో కలుగజేసుకునే అవకాశం లేదు. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరమే రామ మందిర నిర్మాణం జరిగింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!