Ram Mandir: అయోధ్య రామ మందిరాన్ని ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ గురువారం సందర్శించారు. అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ ప్రధాని నిలిచారు. గత నెల 22న అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఫిజీలో భారతీయ ప్రవాసులకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధి బృందానికి బియన్ ప్రసాద్ నాయకత్వం వహించారు.
భారత్, ఫిజీ బంధం గురించి ఆయన మీడియా ముందు హైలెట్ చేశారు. బ్రిటీష్ వలస పాలనలో ఇండియా నుంచి ప్రజలు ఫిజీకి వెళ్లారని, భగవద్గీత-రామాయణం బోధనలను తీసుకెళ్లామని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ప్రాణప్రతిష్ట వేడుకలు ఫిజీ దేశంలో కూడా అట్టహాసంగా జరిగాయని ఆయన వెల్లడించారు.
Read Also: Gyanvapi: జ్ఞానవాపిపై జైల్ భరోకి పిలుపునిచ్చిన ఇత్తేహాద్-ఎ-మిల్లత్ చీఫ్.. బరేలీలో తీవ్ర ఉద్రిక్తత..
విభిన్న మతపరమైన నేపథ్యాలు ఉన్నప్పటికీ ఫిజీలో దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు దేశం మొత్తం ప్రభుత్వ సెలవుదినం. అయోధ్యను దర్శించుకోవడం ఉప ప్రధాని ప్రసాద్ ఒక విశేషంగా భావించారు. ఈ పర్యటన ద్వారా భారత్, ఫిజీ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు.
భారత సంతతికి చెందిన ఫిజీ ప్రజల్లో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచే వలస వెళ్లారు. దీంతో తమకు అయోధ్యతో ప్రత్యేక సంబంధం ఉందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఫిజీతో పాటు భారత సంతతి పౌరులు, హిందువులు ఎక్కువగా ఉన్న మారిషస్ కూడా అయోధ్య ప్రాణప్రతిష్ట రోజు సెలవు ప్రకటించింది.