PM Modi: రాముడు లేడన్న వాళ్లు, ఇప్పుడు “జై సియారం” అంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణ పోలీసులను, డీజీపీ రవిగుప్తాను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ఈ వారం జరిగిన యూఏఈ, ఖతార్ పర్యటనను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతీ మూలలో గౌరవం లభిస్తోందని, ఇది ఒక్క నరేంద్రమోడీకే కానది యావత్ దేశానికి గౌరవం లభిస్తోందని ఆయన అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చామన్నారు. దేశ ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక్క కుటుంబ ప్రయోజనాలే ఎక్కువ అని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాలు చేసిందని దుయ్యబట్టారు.
2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి కార్యక్రమం రేవారిలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయోధ్య హామీని నెరవేర్చామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ సారి 400కు పైగా సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సీట్లు ముఖ్యమని, తనకు మాత్రమ ప్రజల దీవనలే పెద్ద ఆస్తి అని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గతేడాది జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. గత 10 ఏళ్లలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. రాబోయే మూడో టర్మ్‌లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతుందని మోడీ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?