భారత్ ఉగ్రవాదులను ఏరివేస్తు్న్నప్పటికీ ఉగ్రదాడులకు అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రమూకలు ఆత్హాహుతి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడుల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉంచడానికి, యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్‌ను అమలు చేసింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం, రాష్ట్రంలోని మదర్సాలలో అభ్యసించే విద్యార్థులు, మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ATS)కి సమర్పించాల్సి ఉంటుంది. దేశ…
Malegaon blast case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ను ఎన్ఐఏ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ATS) తనను తీవ్రంగా హింసించిందని బీజేపీ మాజీ ఎంపీ ఆరోపించింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవని చెప్పింది.
Malegaon blast: 2008 మలేగావ్ కేసు దర్యాప్తు సమయంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)లో కీలక అధికారి అయిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ మెహిబూబ్ ముజావర్ సంచలన వ్యాక్యలు చేశారు. ఈ కేసులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను అరెస్ట్ చేయాలని తనను కోరారని చెప్పారు. బీజేపీ ఎంపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌తో సహా ఈ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక NIA కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా గురువారం రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్…
ఆపరేషన్ సిందూర్ తర్వాత, అన్ని భద్రతా సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఏజెంట్ల భరతం పడుతున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు తర్వాత, పోలీసులు మరో పెద్ద విజయాన్ని సాధించారు. గుజరాత్ ATS బెంగళూరుకు చెందిన ఒక మహిళను అరెస్టు చేసింది. ఆమెకు భయంకరమైన ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధం ఉందని చెబుతున్నారు. ఆ మహిళ పేరు సామ పర్వీన్, ఆమెకు 30 సంవత్సరాలు. నిఘా సమాచారం…
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
AI Caught Thiefs: రాజస్థాన్‌లోని చురులోని రతన్‌గఢ్ ప్రధాన మార్కెట్‌లోని ఘంటాఘర్, ఘర్ కూడలి మధ్య ఉన్న నగల దుకాణంలో వారం క్రితం జరిగిన కోటి రూపాయల విలువైన చోరీ కేసులో, పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసును చేధించారు. ఈ విషయమై చూరు ఎస్పీ జై యాదవ్ సమాచారం అందించారు. ఏఐ (AI) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసు బృందం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. చోరీ ఘటనను దొంగలు…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, ఏటీఎస్‌లు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసికంగా బలహీనురాలు అని పోలీసులు చెబుతున్నారు. యోగి 10 రోజుల్లో రాజీనామా చేయకుంటే బాబా సిద్ధిఖీలా చంపేస్తామని నిందితురాలు ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో మెసేజ్ చేసింది.
Jharkhand: ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత మంది యువత తప్పు దారి పడుతుంది. యువతను టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థలు వాళ్ళ బోధనలతో యువత ఆలోచనను తప్పుతోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో టెర్రిస్టులు పుట్టుకొస్తున్నారు. దీనితో టెర్రరిజం పైన ద్రుష్టి సారించింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్). ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో టెర్రరిజం పై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు.…
Gujarat : గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఈ ఐదుగురిలో ఒక మహిళ కూడా ఉంది, ఆమె పేరు సుమేరా బానో. ఈ ఐదుగురు ఉగ్రవాదుల గురించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు గుజరాత్‌లో 26/11 తరహా ఉగ్ర దాడిని చేయాలనుకున్నారు.