చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు.
ఇజ్రాయెల్ దళాలు రఫా క్రాసింగ్‌లోని పాలస్తీనా భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో మంగళవారం ఈ విషయాన్ని పేర్కొంది. ధ్రువీకరణ కోసం ఇజ్రాయెల్ సైన్యం త్వరలో ఒక ప్రకటనను ప్రచురిస్తుందని తెలిపింది.
కాకుల్లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ (ASPT)లో పాకిస్తానీ క్రికెటర్ల ఆర్మీ శిక్షణా కొనసాగుతుంది. శిక్షణా శిబిరంలో వారంతా కొండలపై రాళ్లను మోస్తూ కనిపించారు. మొత్తం 29 మంది ఆటగాళ్లు కఠినమైన ఫిట్‌నెస్ సాధించేదుకు కసరత్తులు చేస్తున్నారు. కొత్తగా నియమించబడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు యొక్క ఫిట్‌నెస్ స్థాయిలలో గణనీయమైన మెరుగుదల.. స్థిరంగా బౌండరీలు కొట్టే వారి పవర్-హిటింగ్ సామర్థ్యాన్ని చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బీహార్‌లోని బగాహా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు ప్రమాదానికి గురైంది. బగాహ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. రాజస్థాన్‌లోని ఆర్మీ బెటాలియన్‌ను బెంగాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. రైలులో సైనిక సిబ్బందితో పాటు వారి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రైలులోని మూడు బోగీలు బగాహా వద్ద రైల్వే ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. దీంతో.. గోరఖ్‌పూర్-నర్కటియాగంజ్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.
మూడు సర్వీసుల కోసం అమలవుతున్న కొత్త వికలాంగుల పెన్షన్ విధానంపై లేవనెత్తుతున్న ప్రశ్నలు నిరాధారమైనవని పేర్కొన్న సైన్యం.. మాజీ సైనికులు, యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల వితంతువుల పింఛన్లపై ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొంది.
సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. లొనాక్ సరస్సుపై మేఘాలు విస్ఫోటనం చెందడం వల్ల అది పొంగిపొర్లడంతో తీస్తా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 10 మంది మృతి చెందారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 82 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా వరదల దాటికి 14 వంతెనలు కూలిపోయాయి.
భారత దేశ అభివృద్ధిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్‌కు ఆధునిక పరికరాలతో కూడిన బలమైన సాయుధ బలగాలు అవసరమని రక్షణ మంత్రి ఆదివారం పేర్కొన్నారు. మూడు సేవల ద్వారా ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
Uttarakhand: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న రామెందు ఉపాధ్యాయ్ అనే వ్యక్తి నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల యువతి శ్రేయ శర్మతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు. అప్పటికే పెళ్లైన రామెంద్ ఉపాధ్యాయ్, శ్రేయతో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఒత్తిడి చేయడంతో దారుణంగా చంపేశాడు.
Gabon: ఆఫ్రికా దేశాల్లో వరసగా సైనిక తిరుగుబాటులు జరుగుతున్నాయి. ఇప్పటికే నైగర్ దేశంలో సైనిక తిరుగుబాటు ప్రపంచాన్ని మరోసారి యుద్ధం వైపు నడిపించే విధంగా ఉంది. ఇ