ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్‌లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. ద దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే,…
తాలిబన్లు కాబూల్‌లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్‌లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో…
తాలిబన్ల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. లక్షలాది మంది సైనికులు, ఆధునిక ఆయుధసంపత్తి, 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఇచ్చిన ట్రైనింగ్‌లో రాటు తేలిన ఆఫ్ఘన్ సైనికులను రెండు వారాల వ్యవధిలోనే ఓడించి దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. తాము లేకున్నా, ఆఫ్ఘన్ సైనికులు పోరాటం చేయగలరనే ధీమాతో ఆమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. సెప్టెంబర్ 11 వరకు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేయాలని ఆమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. చాలా ప్రాంతాల్లో…
మళ్లీ లద్ధాఖ్‌లో అలజడి మొదలైంది. గతేడాది ఇండియ చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో రెండు వైపుల నుంచి ప్రాణనష్టం సంభవించింది. రెండు దేశాల సైనికాధికారుల మధ్య 12 విడతలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల సమయంలో ప్యాంగ్యాంగ్, గోగ్రా హైట్స్ వంటి ప్రాంతాల నుంచి ఇరుదేశాలకు చెందిన సైనికులు వెనక్కి వచ్చేశారు. అయితే, మిగతా ప్రాంతాల నుంచి వెనక్కి వచ్చేందుకు చైనా ససేమిరా అంటుండటంతో, చైనా నుంచి ఎదురయ్యే…
భారత సైనికుల చేతికి కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక అయుధాలు అందించింది. చైనా సరిహద్ధుల వెంబడి పహారా కాస్తున్న సైనికులకు అమెరికన్ సిగ్ సావర్ 716, అసాల్ట్ రైఫిల్స్, స్విస్ ఎంపీ 9 గన్స్‌ను సైన్యానికి అందించింది ప్రభుత్వం. లఢఖ్‌లోని న్యోమా వద్ద పహారా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలను అందించింది. ఈ ప్రాంతంలో నిత్యం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుంటాయి. చలికాలంలో మైనస్ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సైనికుల రక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎరెక్టబుల్…
గత కొంత కాలంగా తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వ దళాలలకు మధ్య పోరు జరుగుతున్నది. ఇప్పటికే తాలిబన్ ఉగ్రవాదులు కీలక ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘన్ రక్షణ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. Read: భారత్ కు మరో ఒలంపిక్ మెడల్… ఈ వైమానిక…
అఫ్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలపాటు ఆఫ్ఘన్‌లో అమెరికా బలగాలు మోహరించి ఉగ్రవాదుల కార్యకలాపాలను అణిచివేశాయి. ఎప్పుడైతే ఆ దేశం నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే తాలిబన్లు ఆఫ్ఘన్‌లోని కీలక ప్రాంతాలను స్వాదీనం చేసుకోవడం మొదలుపెట్టారు. దక్షిణ ప్రాంతాలపై ఇప్పటికే పట్టుబిగించిన తాలిబన్లు, ఆ ప్రాంతంలో కీలకమైన కాందహార్ ను ఆదీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. Read:…