బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నాయి. బుడమేరు గండ్లను ఇవాళ పూడ్చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులను అధికారం ముమ్మరం చేశారు. గాబీయన్ బాస్కెట్ విధానంలో పనులు జరుగుతున్నాయి.
బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీఆర్‌డీవో, ఆర్మీ సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్‌ను ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించి కేసులో ఫైజ్ హమీద్‌ను కోర్టు మార్షల్‌కు ముందే సైన్యం అరెస్టు చేసినట్లు ఆర్మీ సోమవారం తెలిపింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగానే కుండపోత వర్షం కురిసింది. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ముంబై, పూణె నగరాలు జలమయం అయ్యాయి.
Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్‌లో, తూర్పు ఇంఫాల్ జిల్లాలోని సైచాంగ్ ఇథమ్ ప్రాంతంలో ఎనిమిది ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లను (ఐఇడి) స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసింది.
జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
భారత సైన్యం దగ్గర ఇప్పుడు బలమైన ఆయుధం ఉంది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ మొదటి స్వదేశీ లాటరింగ్ మందుగుండు 'నాగాస్త్ర-1'ని భారత సైన్యానికి అందజేసింది. ఇది ఇంట్లోకి ప్రవేశించి శత్రువులపై దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారు. ఈ డ్రోన్ శత్రు భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం కలిగి
అజిత్ దోవల్ పేరును అందరికీ సుపరిచితమే. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అనుభవజ్ఞులు, నాయకులు కూడా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా అతడిని ప్రశంసించడం ప్రారంభించారు. తాజాగా ఓ కార్యక్రమంలో అజిత్ దోవల్ ఇజ్రాయెల్ పై ప్రశంసలు కురిపించారు.