Floods: సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. లొనాక్ సరస్సుపై మేఘాలు విస్ఫోటనం చెందడం వల్ల అది పొంగిపొర్లడంతో తీస్తా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 10 మంది మృతి చెందారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 82 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా వరదల దాటికి 14 వంతెనలు కూలిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 3,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. బుధవారం ఉదయం అదృశ్యమైన 23 మంది ఆర్మీ సిబ్బందిలో ఒకరిని రక్షించినట్లు ఆర్మీ తెలిపింది.
Read Also: Death Penalty: ఆరేళ్ల మైనర్‌పై హత్యాచారం.. నాలుగేళ్ల న్యాయపోరాటం తర్వాత నిందితులకు మరణశిక్ష
చుంగ్తాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఇది సింగ్టామ్ సమీపంలోని బర్దాంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలను ముంచెత్తింది. 23 మంది సిబ్బంది, కొన్ని వాహనాలు ప్రవాహంలో కొట్టుకునిపోయాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి”అని సదరు ప్రకటన పేర్కొంది.
Read Also: Kasthuri Shankar: గంటకు ఐదు వేలు వస్తాయ్.. నీకెందుకు బిగ్ బాస్
సిక్కింలో వరద పరిస్థితిపై ప్రధాని మోడీ స్పందించారు. తాను సిక్కిం ముఖ్యమంత్రితో మాట్లాడానని, ఆదుకుంటానని హామీ ఇచ్చానని తెలిపారు. సిక్కిం అడ్మినిస్ట్రేషన్ నివాసితులకు హై అలర్ట్ ప్రకటించింది. స్థానిక నివాసితులు రికార్డ్ చేసి, షేర్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఉదృత ప్రవాహాలు.. దెబ్బతిన్నరోడ్ల వీడియోలు వరద పరిస్థితిని కళ్లకు కట్టాయి. అయితే, ఎవరూ గాయపడలేదని, భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.