ఇజ్రాయెల్ దళాలు రఫా క్రాసింగ్‌లోని పాలస్తీనా భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో మంగళవారం ఈ విషయాన్ని పేర్కొంది. ధ్రువీకరణ కోసం ఇజ్రాయెల్ సైన్యం త్వరలో ఒక ప్రకటనను ప్రచురిస్తుందని తెలిపింది. కాగా.. దక్షిణ గాజాలోని ఈజిప్టు సరిహద్దులో రాఫా క్రాసింగ్ ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ ఒక రోజు మందు ప్రజలకు ఓ ప్రకటన జారీ చేసింది. తూర్పు రఫాను ఖాళీ చేయమని నివాసితులకు చూచించింది. అనంతరం సోమవారం రాత్రి రఫా ప్రాంతంలో అనేక పేలుళ్లు సంభవించాయి.
READ MORE: PM Modi: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని సహించబోం.. కర్ణాటక సర్కారుపై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
దీనికి ఒక రోజు ముందు, అంటే మే 6 న, ఇజ్రాయెల్ సైన్యం ఎప్పుడైనా రఫాపై దాడి చేయవచ్చని తేల్చి చెప్పింది. దీని దృష్ట్యా సోమవారం ఇజ్రాయెల్ దళాలు తూర్పు రఫాను ఖాళీ చేయమని పాలస్తీనియన్లకు సూచించాయి. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది యుద్ధ-నిరాశ్రయులైన పాలస్తీనియన్లు అక్కడ ఆశ్రయం పొందారు. ముఖ్యంగా, హమాస్‌పై యుద్ధంలో ఏడు నెలల పాటు, ఇజ్రాయెల్ రఫాలో చొరబాట్లను ప్రారంభించాలని అనేకసార్లు బెదిరించింది. రఫాలో వేలాది మంది హమాస్ యోధులు, డజన్ల కొద్దీ బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ సైన్యం విశ్వసిస్తోంది. రఫాను ఓడించకుండా విజయం అసాధ్యమని సైన్యం నిర్ధారించుకుంది. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది.
కాగా.. ఇజ్రాయెల్, పాలస్తీనా గత 50 ఏళ్ళలో ఎన్నడూ చవిచూడనంత అతిపెద్ద సంఘర్షణగా ప్రస్తుత యుద్ధం పరిణమిస్తోంది. గతేడాది అక్టోబరు 7న హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడులలో ఇప్పటి వరకు లక్షల మందికి మరణించారు. వీరిలో ఎక్కువమంది సాధారణ పౌరులే. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాస్ట్రిప్ నంతటిని దిగ్బందించింది. ఈ యుద్ధం వల్ల ఎంతో మంది నిరాశ్రయిలయ్యారు. ఈ యుద్ధం ఇజ్రాయెల్, గాజా సరిహద్దులను దాటి విస్తరించే ప్రమాదముందనే విషయంపైనే ప్రపంచమంతా దృష్టిసారించింది.