జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అని భావిస్తున్నారు. ఉగ్రవాదుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.
లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
చైనాతో దౌత్యానికి సమయం పడుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. గత మూడేళ్లలో చర్చల ద్వారా తూర్పు లడఖ్‌లో ఐదు, ఆరు ఘర్షణ పాయింట్లలో భారత్, చైనాలు పురోగతి సాధించాయని తెలిపారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యమునా నది ఉప్పొంది ప్రవహిస్తోంది. యమునా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో వరద నీరు పోటెత్తుతోంది.
మంచు శివలింగం దర్శనం కోసం భక్తులు చేపట్టే అమర్‌నాథ్ యాత్ర పునః ప్రారంభమైంది. భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల క్రితం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే
Amazon Jungle: 40 రోజుల క్రితం కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో అదృశ్యమైన నలుగురు చిన్నారులు అమెజాన్ అడవిలో ఆచూకీ లభించింది. అధ్యక్షుడు గుస్తావో పెట్రో శనివారం ఈ సమాచారాన్ని అందించారు.
అమెజాన్ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పి పోయిన చిన్నారులు 40 రోజుల తరువాత క్షేమంగా కనుగొనబడ్డారు. కొలంబియన్ అధికారులు 40 రోజుల క్రితం ఒక చిన్న విమాన ప్రమాదం నుండి బయటపడిన నలుగురు స్వదేశీ పిల్లలను సజీవంగా కనుగొన్నారు.