బీహార్‌లోని బగాహా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు ప్రమాదానికి గురైంది. బగాహ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. రాజస్థాన్‌లోని ఆర్మీ బెటాలియన్‌ను బెంగాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. రైలులో సైనిక సిబ్బందితో పాటు వారి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రైలులోని మూడు బోగీలు బగాహా వద్ద రైల్వే ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. దీంతో.. గోరఖ్‌పూర్-నర్కటియాగంజ్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.
మంగళవారం రాత్రి.. బగాహా రైల్వే స్టేషన్ సమీపంలోని దాలా నంబర్ ఎల్-సిఎన్-50-సి గూడ్స్ గోదాం సమీపంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. వాహనాలన ఎక్కించిన రైలు బోగీలు పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్మీ సిబ్బంది కూర్చున్న బోగీలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేదంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేది.
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరుగనున్న జీతాలు..
ఈ ప్రమాదం తర్వాత రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పట్టాలు తప్పిన రైలు బోగీలను రైల్వే ట్రాక్‌పై నుంచి తొలగించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. బగాహ రైల్వే గేట్ దగ్గర ప్రమాదం జరగడంతో రైలు అక్కడే నిలిచిపోయింది. అంతేకాకుండా.. రైల్వే గేటు మూసి ఉండడంతో ఇతర వాహనాలు కూడా అటు ఇటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
బగహా రైల్వే స్టేషన్ గేట్ నేషనల్ హైవే-727లో ఉంది. దీంతో జాతీయరహదారి పూర్తిగా జామ్ అయింది. సమాచారం ప్రకారం.. ఆర్మీ స్పెషల్ రైలు పట్టాలు తప్పిన ట్రాక్‌లను తిరిగి ట్రాక్‌పైకి తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో పలువురు రైల్వే అధికారులు, ఉద్యోగులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు.. అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.