Uttarakhand: నేపాలీ మహిళతో ఆర్మీ అధికారి డేటింగ్.. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న రామెందు ఉపాధ్యాయ్ అనే వ్యక్తి నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల యువతి శ్రేయ శర్మతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు. అప్పటికే పెళ్లైన రామెంద్ ఉపాధ్యాయ్, శ్రేయతో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఒత్తిడి చేయడంతో దారుణంగా చంపేశాడు.
వివరాల్లోకి వెళ్లే పశ్చిమ బెంగాల్ సిలిగురిలో డ్యాన్స్ బార్ లో శ్రేయతో, రామెందుకు పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లి కావడం, శ్రేయ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను చంపేశాడు. సిర్వాల్ గఢ్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన 24 గంటల్లో కేసును ఛేదించారు. పండిట్వారీ ప్రేమ్ నగర్‌లోని నిందితుడిని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: Kim Jong Un: రష్యా వెళ్లిన కిమ్.. పుతిన్‌తో ఆయుధ ఒప్పందం..
బాధితురాలు శ్రేయతో రామెందు గత మూడేళ్లుగా వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఇటీవల డెహ్రాడూన్ బదిలీ అయిన సమయంలో కూడా శ్రేయను అతనితో పాటు తీసుకువచ్చాడు. అక్కడే ఆమె కోసం అద్దెకు ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. ఈ విషయాలను నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి రాజ్‌పూర్ క్లబ్ లో శ్రేయతో కలిసి రామెందు ఉపాధ్యాయ్ మద్యం సేవించి లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లాడు. నగర శివార్లలోకి రాగానే థానో రోడ్ లో రాత్రి 1.30 గంటల ప్రాంతాలో శ్రేయ తలపై సుత్తితో పదేపదే కొట్టి హత్య చేశాడు. ఆమె మరణించిన తర్వాత మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత పోలీసులు కేసును విచారించి నిందితుడు రామెందు ఉపాధ్యాయ్ ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..