India-China: చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు అంశాలపై ఇంకా సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని తెలిపారు.
READ MORE: Elections 2024: రేపే నాల్గో విడత పోలింగ్.. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్..
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ప్రధాని ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దు సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దేశాల మధ్య సయోధ్య అవసరమని.. ఇరుదేశాల మధ్య సంబంధాలు కేవలం భారత్, చైనాకే కాకుండా యావత్ ప్రపంచానికి చాలా కీలకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న ప్రశ్నకు జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకూ జైశంకర్ స్పందించారు. 2014కి ముందు తయారీ రంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కుండబద్దలు గొట్టారు. 2020లో గల్వాన్‌లో సైనిక ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు దఫాల్లో చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా అనేక అంశాలపై సయోధ్య కుదరలేదు. భారత్ వైఖరి న్యూట్రల్ గానే ఉన్న చైనా మాత్రం ఖయ్యానికి కాలుదువ్వుతోంది.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!