తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభాలెక్కల తర్వాతనే అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రస్తుత 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 స్థానాలకు, తెలంగాణ లోని ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలను 153 స్థానాలకు పెంచాలని సూచించింది ఏపీ పునర్విభజన చట్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 లో నిర్వహించే జనాభా లెక్కల పూర్తి అయున తర్వాతనే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం స్పష్టం…
మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో ఆయన కీలక నేత. ఒకానొక సమయంలో సీఎం రేస్ వరకు వెళ్లారు. రాజకీయాలంటే బోర్ కొట్టిందో ఏమో సైలెంట్గా ఉండిపోయారు. ఒక సామాన్యుడిలా మారిన ఆయన జీవనశైలిని చూసి ఆశ్చర్యపోయారు జనం. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. మరి.. ఇకనైనా అజ్ఞాతం వీడతారా? ఎవరా నాయకుడు? రెండున్నరేళ్లుగా నీలకంఠాపురంలోనే రఘువీరారెడ్డి! మెరిసిన గడ్డంతో.. సామాన్య రైతులా కనిపిస్తున్న ఈయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో…
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. క్యాప్టివ్ మైన్స్ ను వైజాగ్ స్టీల్స్ కు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు అన్నారు. పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దాం. మనము ఓట్లు వేస్తే ఉన్న కేంద్ర ప్రభుత్వం… ప్రజల ఆలోచనలకు కట్టుబడి ఉండాలి. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మితే సహించేది లేదు… ఆంధ్ర వాళ్ళము చూస్తూ ఉరుకొము. వెస్ట్ బెంగాల్,కేరళలో ప్రభుత్వ రంగ…
ఏపీ బీజేపీ పూర్తిగా మారిపోయిందా? రోజూ రోడ్డు మీదే ఉంటోందా? ప్రజా సమస్యలు.. పార్టీ కార్యక్రమాలతో బీజీ అయిపోయిందా? ఇంతలోనే అంత ఛేంజ్ ఎలా వచ్చింది? ఈ మార్పు వెనక ఉన్నది ఎవరు? ఢిల్లీకి చెందిన ఆ నేత అంతగా ఎలా ప్రభావం చూపుతున్నారు? ఉత్సాహపరిచారా? ఊరికే కూర్చుంటే ఊరుకోబోమని హెచ్చరించారా? శివప్రకాష్ చెప్పింది చేయకపోతే అసలుకే ఎసరొస్తుందా? ఏపీలో బీజేపీకి ఇంఛార్జ్.. కోఇంఛార్జ్ ఉన్నారు. కేంద్రమంత్రి మురళీధరన్ ఇంఛార్జ్ కాగా.. రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో…
గుంటూరు జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు చేస్తున్నారు అధికారులు. భయం గుప్పిట్లో కరోనా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కంటోన్మెంట్ జోన్లలో బిగుసుకుంటున్నాయి బారికేడ్లు. గడిచిన పది రోజులుగా ఆ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో కంటైన్న్మెంట్ జోన్లలో బారికేడ్లు కట్టారు అధికారులు. ఫలితంగా జిల్లాలో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు… ఎక్కడ కరోనా కేసులు నమోదైతే అక్కడ…
కోల్మైనింగ్లో ఎపిఎండిసి- ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మరో కీలక మందడుగు వేసింది అని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని సుల్యారీ బొగ్గుగనిలో మైనింగ్ భూమిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… ఈ వారం నుంచే తవ్వకాలు ప్రారంభం అవుతాయి. నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. 1298 హెక్టార్ల భూమిలో, 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో మైనింగ్ చేపడుతున్న ఏపీఎండీసీ… ఏటా 5 మిలియన్ టన్నుల…
తూర్పు పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీవో భవనంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేసారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణం రెగ్యులరైజ్ చేయాలి. సిపిఎస్ రద్దు విషయాన్ని ప్రకటించాలి. ప్రభుత్వ విద్యారంగ మార్పులు వినాశనానికి దారి తీస్తాయి అని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. ప్రాథమిక పాఠశాల విద్యారంగ పరిరక్షణకు ఉద్యమిస్తాం అని ఆయన…
మంత్రి అప్పలరాజు పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టించడానికి మంత్రికి సిగ్గనిపించడం లేదా… ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని అడిగారు. పలాసలో పోలీసులు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారా , ప్రజలకోసం పనిచేస్తున్నారా. టీడీపీ నుంచి ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పడేశారు. వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే టీడీపీ వారి పై కేసులు పెట్టారు. మాకూ సోషల్ మీడియా ఉంది… మేం పోస్టులు పెట్టలేక కాదు..…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాము పాటు పోరాటం చేసి సాధించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో కలసి పోరాటం చేస్తాం అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కోవిడ్ లో వేలాది మంది ప్రాణాలు కాపాడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ఇప్పుడు దానిని అమ్మితే బావి తరాలు ఏం చేయాలి… అని కేంద్రం ఆలోచన చేయాలి అని తెలిపారు. వైజాగ్ స్టీల్ అప్పును…
ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్! చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత…