ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. ఇందులో 19,48,828 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 19,949 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది…
ఆమె ఏ పనిచేసినా ఓ లెక్క ఉంటుందా? ప్రచారంపై ప్రేమ కూడా అంతేనా? కంటెంట్ కంటే కటౌట్ను నమ్ముకుంటారా? ఇప్పుడు సీఎం దృష్టిలో పడితే జాతకం మారిపోతుందనే ఆశల్లో ఉన్నారా? అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదలుకోవడం లేదా? తాజాగా ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ఫీట్లు.. పాట్లు.. పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరిచాయట. అవేంటో.. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం. సీఎం పాల్గొన్న కార్యక్రమంలో రజనీ హడావిడి! విడదల రజని. గుంటూరు జిల్లా చిలకలూరిపేట…
పేదలకు పట్టాల పంపిణీ.. ఆ నియోజకవర్గంలోని అధికారులకు అక్షయపాత్రగా మరిందట. భారీగానే నొక్కేసి.. వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాసులు దండుకుని.. ఎమ్మెల్యేకే చెవిలో పువ్వులు పెట్టారని పవర్లో ఉన్న పార్టీ కేడర్ చికాకు పడుతోందట. వారెవరో.. ఏం చేశారో.. ఈ స్టోరీలో చూద్దాం. చంద్రగిరిలో 150 ఎకరాలు సేకరించిన అధికారులు! పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్దఎత్తున భూసేకరణ చేపట్టింది. ప్రభుత్వ భూములతోపాటు డీకేటీ భూముల నష్ట…
పులిచింతల ప్రాజెక్టులో జరుగుతున్న మరమ్మతు పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. ఏ లక్ష్యంతో అయితే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో ఆ లక్ష్యం నెరవేరేలా వైయస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తుంది. ట్వీట్లు పెట్టే నాయకులు అధికారం లో ఉన్నప్పుడు పులిచింతల పనుల్లో నాణ్యత లో గుర్తించడంలో విఫలమయ్యారు అని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతం. 48 గంటల్లో 16వ గేట్ స్థానంలో స్టాప్ లాక్స్ నిర్మాణం…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,376 సాంపిల్స్ పరీక్షించగా.. 1,908 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 23 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,103 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,80,258 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,46,370 కి చేరింది..…
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం లో మాట్లాడుతూ… నేను బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నా. బీజేపీ అధికారంలోకి రాకముందు నేను అన్ని జిల్లాలు తిరిగాను. మేనిఫెస్టో కమిటీలో పనిచేశాను. ప్రతీ రాష్ట్రంలోనూ వెనుకబడిన జిల్లాలున్నాయి. దేశవ్యాప్తంగా 114 జిల్లాలను యాస్పిరేషన్ జిల్లాలుగా ప్రకటించారు. విజయనగరం జిల్లా సంస్కృతికి , సంప్రదాయాలకు పుట్టినిల్లు. కానీ నేటికీ విజయనగరం జిల్లా వెనుకబడే ఉంది అని అన్నారు. ఇది మన ప్రభుత్వ వైఫల్యం కాదు. మన పార్టీ వైఫల్యం అని…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీతారామన్ పాల్గొననున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేడు నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఫెస్టివల్లో పాల్గొంటారు ఆర్ధిక మంత్రి. తర్వాత విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. రేపు నిర్మలా సీతారామన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్…
పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు! ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల…
ఏపీ దేవాదాయ శాఖలో ఏసీ, డిసి వివాదం పై మొదటి రోజు విచారణ ముగిసింది.ఇద్దరి నుండి స్టేట్ మెంట్ తీసుకున్నారు రీజనల్ జాయింట్ కమిషనర్ సురేష్. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ… ఈ వివాదానికి సంబందించి దేవాదాయ కమిషనర్ కు త్వరలోనే నివేదిక సమర్పిస్తాం. వీరు ఇద్దరి తో పాటు సంఘటన జరిగిన ముగ్గురు అధికారులు నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాం. గతంలో ఈయన పై ఉన్న ఫిర్యాదు లపై చర్చించాం అన్నారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ శాంతి…
ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి అధికారపార్టీ పంచన చేరారు. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి ఆరునొక్క రాగం అందుకుందట. దీంతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ఎలా బయటపడతారోననే చర్చ మొదలైంది. వాసుపల్లి పార్టీ మారినా వైసీపీలో పెద్దగా మార్పు లేదట! వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పవర్లో ఉన్నప్పుడు వైసీపీపై…