2026 సంక్రాంతి శోభతో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను గోదావరి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విజయవాడలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పల్లె వాతావరణాన్ని తలపించేలా…
తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భగవంతుడు సంకల్పంతో తాను పిఠాపురం వచ్చానని, అధికారం ఉన్నా లేకపోయినా పిఠాపురం ప్రజలు కోసం పని చేస్తానని చెప్పారు. పిఠాపురంలో పక్షి ఈక పడినా ఏదో జరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరి పిఠాపురంకి వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరి వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దేశం కోసం పని చేసేవాడిని పండగలకు, పబ్బాలకు రాలేదని అంటున్నారని పవన్ ఫైర్…
కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం (జనవరి 4) హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఇటీవల మరణించిన టీడీపీ…
అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు గ్రామ రైతులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ గ్రామ సభలో పాల్గొన్నారు. రాజధాని గ్రామాల అభివృద్ధి గురించి గ్రామస్థుల అభిప్రాయాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల…
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి విడదల రజని తీవ్ర స్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత జీవితాలను పూర్తిగా నాశనం చేస్తోందని విడదల రజని ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చివరికి వారి…
ప్రస్తుత సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కామాంధులు కొందరు వావి వరుసలు లేకుండా మృగాళ్లుగా మారుతున్నారు. శారీరక సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలపైనే.. కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కన్న కూతురిపైనే అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. Also Read: Puri Jagannadh: డైరెక్టర్ పూరి పరిస్థితేంటి?.. అసలేమైంది? చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దబ్బకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కూతురు అయిన బాలికను…
సైబర్ నేరాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కొందరు వారి వలలో చిక్కుకుంటున్నారు. ఇక కాలర్ టోన్లో కూడా డిజిటల్ అరెస్ట్లు ఏమీ లేవంటూ అలర్ట్ చేసినా కొందరు మాత్రం కేటుగాళ్ల ఎత్తులకు భయపడి డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.20.77 కోట్లతో చేపట్టనున్న ఈ ఆధునీకరణ పనులు కోనసీమ కొబ్బరి రైతులకు పెద్ద ఊరట కలిగించనున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోనసీమ కొబ్బరి రైతుల కన్నీరు తనను కదిలించిందన్నారు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్తో వస్తామని చెప్పిన తాము.. 35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునీకరణకు అడుగులు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం హెడ్ క్వాటర్గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే మార్కాపురం హెడ్ క్వాటర్గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం (డిసెంబర్ 31) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2 కొత్త జిల్లాల…
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. Also Read: Anil Ravipudi-Chiranjeevi: చిరుని చూసి.. చరణ్కు తమ్ముడా అని అడుగుతున్నారు! గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేయాలని 2023లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్ పాయింట్లను సవాలు…