చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 2500 నక్షత్ర తాబేళ్ళను సీజ్ చేసారు అధికారులు. ఏపీ నుండి చెన్నై అక్కడి నుండి థాయిలాండ్ కు వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారు. కార్గో విమానంలో థాయ్‌లాండ్‌కు స్మగ్లింగ్ చేస్తున్న 25 లక్షల విలువైన 2,500 నక్షత్ర తాబేళ్లబు స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు. 15 బాక్సుల్లో ఎండ్రకాయల పేరుతో ఈ నక్షత్ర తాబేళ్ళను తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తీసుకోచ్చి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బాక్స్ ల పైన ఉన్న అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.