గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య బాధకలిగించింది అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అయితే గుంటూరు ఘటన పై సీఎం జగన్ తక్షణమే స్పందించారు అని తెలిపారు. ఇక గుంటూరులో లోకేష్ పర్యటించడాన్ని మేం తప్పు పట్టడం లేదు. కానీ లోకేష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. చెత్తనాకొడుకులు , వెధవలు అని మాట్లాడుతున్నాడు. మాకు బూతులు రావా …మేం మాట్లాడలేమనుకుంటున్నారా అని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారి వ్యవహరించడం సరికాదు. సానుభూతి పేరుతో రాజకీయ డ్రామాలెందుకు. పిడికిలి బిగించాలంటున్నావ్ …. మీ నాన్న సమయంలో ఇలాంటి హత్యలు జరలేదా… ఆరోజు ఎందుకు మీ నాన్న మీద పిడికిలి బిగించలేదు అని అడిగారు. దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా లోకేష్ కు తెలియడం లేదు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే గన్ లో బులెట్ కంటే ముందు జగన్ వస్తారు… రాసిపెట్టుకోండి అని పేర్కొన్నారు.