కాకినాడ స్థానిక డైరీ ఫారం సెంటర్ వద్ద గల బిస్ఎన్ ఫిల్లింగ్ స్టేషన్ నందు విక్రయిస్తున్న పెట్రోల్ కారణంగా గత మూడు రోజులుగా అనేక వాహనాలు చెడిపోవడం తో గత మూడు రోజుల గా వాహనదారులులు నిరసనలు తెలియజేస్తున్నారు, వాహనదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా ,సివిల్ సప్లై అధికారులు ఏ మాత్రం తొంగి చూడకపోవడం తో వాహనదారులు సంబంధిత అధికారులు తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సుమారు వందకు పైగా వాహనాలు చెడిపోగా,పది వాహనాలను మాత్రమే పెట్రోలు బంక్ వారు బాగుచేయించారు అంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా వంద రూపాయలు పెట్రోల్ పోయించుకుంటే,లక్షల విలువ చేసే వాహనాలు దెబ్బతింటున్నాయని,ఇటువంటి మోసాలకు పాల్పడుతూ, ప్రజల వాహనాలతో ఆటలు ఆడే ఇలాంటి పెట్రోలు బంకు లను తక్షణమే సీజ్ చేసి తమకు న్యాయం చేయాలంటూ వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.