ఏపీ టీడీపీలో మరో వికెట్ పడింది. అంటే పార్టీ నుంచి వెళ్లడం కాదండోయ్.. జైలుకు వెళ్లడం. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సెంట్రల్ జైళ్లకు వెళ్లడం కామనై పోయింది. అచ్చెన్న, కొల్లు అరెస్ట్ అయినా వెనక్కి తగ్గని ఉమా! ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు అయ్యారు. దమ్ముంటే తనను అరెస్టు చెయ్యాలంటూ రెండేళ్లుగా సవాళ్లు చేస్తున్న ఈ మాజీ మంత్రిని వైసీపీ ప్రభుత్వం…
రాజోలు వైసీపీలో మళ్లీ ఆధిపత్య పోరు పీక్కు చేరుకుంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న నాయకుడికి పదవి రావడంతో ఆయన జూలు విదిలిస్తున్నారు. మధ్యలో నా సంగతేంటని పార్టీ ఇంఛార్జ్ హూంకరింపులు మామూలే. ఇంకోవైపు అధికారపార్టీకి సపోర్ట్‌గా నిలిచిన ఎమ్మెల్యే ఎత్తుగడలు. మొత్తంగా ఈ మూడు ముక్కలాట పంచాయితీ తాడేపల్లి చేరుకుందనే చర్చ జరుగుతోంది. మరి అక్కడైనా పరిష్కారం లభిస్తుందా? రాజోలు వైసీపీలో మూడు ముక్కలాట! తూర్పుగోదావరి జిల్లా రాజోలు వైసీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు అధిష్ఠానం పెద్దల…
పలాస – కాశీబుగ్గ మున్సిపాల్టీకి రెండో వైస్ ఛైర్మన్ గా ఒక దళిత సోదరుడు ఎన్నిక కావడం పలాస చరిత్రలో గొప్ప అధ్యాయం అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి సోషలిస్టు. వెనుకబడిన, దళిత గిరిజన వర్గాలకు చెందిన ఐదుగురిని ఉపముఖ్యమంత్రులుగా చేశారు. అన్ని రాజకీయపదవులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జనగ్ కే దక్కుతుంది. ఇక చెత్త పై పన్నువేసే విషయంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,641 సాంపిల్స్ పరీక్షించగా.. 2,068 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 22 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,127 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,117 కు పెరగగా… రికవరీ కేసులు 19,29,565 కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్…
పశ్చిమ గోదావరి జిల్లా నుండి అస్సాం,పశ్చిమ బెంగాల్, బoగ్లాదేశ్ లకు చేపల ఎగుమతులు నిలిచిపోయాయి. లోకల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటంతో ఏపీ సరుకును కొనుగోలు చేయడం లేదు పశ్చిమ బెంగాల్. దాంతో ప్రతి రోజు 2500 టన్నుల చేపల ఎగుమతులు నిలిచిపోతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతులు నిలిచిపోవటం తో లబోదిబో మంటున్నారు చేపల పెంపకందారులు. ఎగుమతులు నిలిచిపోవటం తో రైతుల వద్ద కొనుగోళ్ళకు ముందుకు రావడం లేదు బయ్యర్లు. దాంతో మార్కెట్ వాల్యూ భారీగా పడిపోయింది.…
పదవుల పంపకాల్లో అనేక వడపోతలు.. లెక్కలు వేస్తాయి పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీ అయితే మరెన్నో సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇటీవల ఏపీలో అదే జరిగిందని వైసీపీ వర్గాల్లో ఒక్కటే చర్చ. కాకపోతే ఆ జిల్లాలో మాత్రం విభజించు.. పాలించు సూత్రం పాటించారని చెవులు కొరుక్కుంటున్నారట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పదవుల పంపకంలో సామాజిక లెక్కలు! ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో కృష్ణాజిల్లాకు కీలకమైన పోస్ట్‌లే దక్కాయి.కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఏపి పరిశ్రమల అభివృద్ధి…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 78,784 శాంపిల్స్‌ను పరీక్షించగా, 2,107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,62,049 కి చేరింది. ఇందులో 19,27,438 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 1,807 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం 50 లక్షల విరాళం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని విఐటి ఫౌండర్ & ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ కలిశారు . ఈ సందర్బంగా విఐటి విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ అత్యంత ప్రతిష్ట్మాకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తింపు పొందిందని మరియు విఐటి-ఏపీ విశ్వవిద్యాలయ పురోగతిని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి మొదటి విడతలో 25…
చేతికి పదవి వస్తే కొందరు గాలిలో తేలిపోతారు. అప్పటి వరకు చుట్టూ ఉన్నవాళ్లకు కూడా అందకుండా పోతారు. ఆ ఎమ్మెల్సీ సైతం అంతేననే టాక్ వైసీపీ కేడర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయ్యవారు సోషల్ మీడియాలో చురుకు కావడంతో… ‘సార్..! మా గోడు’ పట్టించుకోండి అంటూ అదే సామాజిక మాధ్యమాల్లో రిక్వస్ట్లు పెడుతున్నారట. దీంతో పదవి రాకముందు దువ్వాడ.. పదవొచ్చాక దూరమయ్యాడా..! అని సెటైర్లు వేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ!…
అమరావతిలో దొంగలు పడ్డారా? డబ్బులు.. నగలు.. ఇతర ఖరీదైన వస్తువులు కాకుండా రోడ్డులు ఎత్తుకుపోతున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం అమరావతిలో ఇదే హాట్ టాపిక్. ఈ దోపిడీ కేంద్రంగా రాజకీయ రగడ కూడా మొదలైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాజధాని కోసం నిర్మించిన రోడ్లను ఎత్తుకుపోతున్నారు! అమరావతి రెండేళ్లుగా నిఘా నీడలో ఉంది. అయినప్పటికీ పోలీసుల కన్నుగప్పి ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వాళ్లు ఎత్తుకు పోతుంది ఇళ్లలోని బంగారమో.. నగదో కాదు.…