రవాణా అధికారులపై మంత్రి పేర్ని నాని గాంధీగిరి…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో నేత ఒక్కోటైపు. కొంతమంది నోటికి పని చెప్తే.. మరికొందరు మైండ్‌కి పని చెబుతారు. ఏపీలో ఓ మంత్రి రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందిని అవమానించిన అధికారికి గాంధేయ పద్ధతిలో ట్రీట్ ఇచ్చారు ఆ మంత్రి. ఎవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మంత్రి ఖరీదైన ప్లేట్‌మీల్స్‌పై చర్చ!
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ఒక్కపూట భోజనానికి రెండున్నర వేలు. అధికారికవర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. పూట భోజనానికి రెండున్నర వేలు ఖర్చు పెట్టిన మంత్రి పేర్ని నాని గురించి రవాణశాఖలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆ మాత్రం ఖర్చు చేయడం పెద్ద విషయం కాకున్నా.. మంత్రి తిన్న రెండున్నర వేల విలువైన ప్లేట్ మీల్స్ గురించే ప్రత్యేకంగా చెప్పుకొంటున్నారట. ఈ ఖరీదైన ప్లేట్‌మీల్స్‌పై ఈస్థాయిలో చర్చ జరగడం వెనక పెద్ద కథే నడిచిందట.
మంత్రి సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో నుంచి భోజనం ప్లేట్లను లాగేసిన రవాణా ఉద్యోగి?
కొద్దిరోజుల క్రితం రవాణాశాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించింది. మంత్రి హోదాలో ఆ కార్యక్రమానికి పేర్నినాని హాజరయ్యారు. మంత్రితోపాటు వ్యక్తిగత సిబ్బంది.. సెక్యూరిటీ ఉన్నారు. ఆయన వెంట ఓ అనుచరుడు కూడా వెళ్లారట. ఉన్నతాధికారులతో కలిసి మంత్రి.. మంత్రి అనుచరుడు కలిసి భోజనం చేశారు. మంత్రి గన్‌మెన్, వ్యక్తిగత సిబ్బంది కూడా భోజనం చేద్దామని వెళ్లగా.. వారి చేతుల్లోంచి భోజనం ప్లేట్లను లాగేసుకున్నారట రవాణాశాఖ ఉద్యోగి. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీ మీద కంప్లయింట్ చేస్తామని బెదిరించి.. భోజనాల దగ్గర నుంచి వెళ్లగొట్టారట ఆ ఉద్యోగి.
మంత్రి వెనక్కి వచ్చి అధికారి చేతిలో రూ. 5వేలు పెట్టారట!
కంగుతిన్న రవాణాశాఖ ఉన్నతాధికారులు!
ఆ కార్యక్రమం నుంచి వేరేచోటుకు వెళ్తున్న సమయంలో భోజనాలు చేశారా అని సిబ్బందిని అడిగారట మంత్రి పేర్ని నాని. దీంతో అక్కడ జరిగిన బాగోతాన్ని వారు మంత్రికి వెళ్లడించారట. ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని.. వెంటనే కారును వెనక్కి తిప్పమని చెప్పి తిరిగి వర్క్‌షాప్‌నకు చేరుకున్నారట. అక్కడున్న రవాణాశాఖ అధికారిని పిలిచి అతని చేతిలో 5 వేల రూపాయలు ఉంచారట మంత్రి. తాను, తన అనుచరులు లోపల భోజనం తిన్నామని.. ఆ రెండు ప్లేట్లకు కలిపి 5 వేలు తీసుకోవాలని చెప్పారట. మంత్రి అలా ఎందుకు ప్రవర్తించారో? ఎందుకు డబ్బులు ఇచ్చారో ఆ అధికారికి అర్థం కాలేదట. వెంటనే తేరుకుని ‘సార్… ఏమైంది?’ అని మంత్రినే అడిగారట ఆ అధికారి. తమకు భోజనాలు పెట్టింది రవాణాశాఖ అనుకున్నాం. సొంత ఖర్చుతో పెట్టారని తెలియదు. అందుకే డబ్బులు ఇస్తున్నా’ అని మంత్రి చెప్పారట. గన్‌మెన్ చేతుల్లోని భోజనం ప్లేట్లు లాక్కున్న సంగతిని ప్రస్తావించారట.
హడావిడి చేసిన రవాణా శాఖ ఉద్యోగి ట్రాన్స్‌ఫర్?
అసలు విషయం బోధపడి.. అక్కడున్న ఉన్నతాధికారులు కంగుతిన్నారట. ఆ విధంగా మంత్రిగారి ప్లేట్‌మీల్స్ రెండున్నర వేలు అని చర్చ మొదలైంది. ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏంటంటే.. భోజనాల దగ్గర హడావిడి చేసిన రవాణాశాఖ ఉద్యోగి ఇటీవలే వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారట. మంత్రిగారి కోపం వల్లే ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యాడని టాక్. అయితే ఆ బదిలీకి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఉద్యోగుల ట్రాన్సఫర్లలో జోక్యం చేసుకోబోనని మంత్రి అన్నట్టు సమాచారం. అసలు సంగతి ఎలా ఉన్నా.. ఈ భోజనాల రగడ మాత్రం.. రవాణాశాఖలో ఆ ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌కు కారణమైందనే చర్చ ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!