తెలుగు అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశగా ఉంది. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసిపడేసింది. తెలుగు అనే పేరు లేకుండా చేసేశారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు అని తెలుగు అకాడమీ సొసైటీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు భాషాభిమానులు ఆలోచన చేసుంటే ఇలాంటి దుర్ధశ పట్టేది కాదు అని తెలిపారు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత…
వచ్చే ఎన్నకలలో నేను నగిరి నుండి పోటీచేస్తానని ప్రచారం చేయడం తప్పుడు ప్రచారం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజ్యసభ అవకాశం వస్తేనే తీసుకోకుండా అజీజ్ పాషా కు ఇచ్చాం. పదవి కాంక్ష లేదు. బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. “పేగసస్” వ్యవహారం తమ ప్రభుత్యంను అస్తిర అస్థిరపరిచే అంతర్జాతీయ కుట్ర అంటున్న మోడీ ప్రభుత్వం విచారణ కు ఎందుకు భయపడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలి అన్నారు. ఇక ఏపీ…
ఏపీలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,287 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,430 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462 కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,34,048 కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,395 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,019…
కరోనా కారణంగా ప్రస్తుతం ఏపీలో స్కూళ్లు బంద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అందువల్ల 16వ తేదీ నాటికి మొదటి విడత నాడు-నేడు పనులు పూర్తి చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాడు-నేడు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షితున్నారు విద్యా శాఖ ఉన్నతాధికారులు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా జరుగుతున్నాయి నాడు-నేడు పనులు.ఆధునికీకరణతో ప్రభుత్వ స్కూళ్లకు న్యూ లుక్ రానుంది.…
అక్కడ టీడీపీకి అభిమానులు.. కార్యకర్తలు బాగానే ఉన్నారు. పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అధినేతకు కూడా అంతు చిక్కడంలేదా .. లేక యథావిధిగా నానబెడుతున్నారా? నాయకుడు లేని పార్టీలో ఏం చెయ్యాలో కేడర్‌కు కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? శివరామ్‌కు బాధ్యతలు అప్పగింతపై బాబు డైలమా? గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాత నియోజకవర్గంలోని…
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితముగాఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు లూరిసె అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం…
మొన్నటి ఎన్నికల సమయంలో ఆ నేతలిద్దరి ప్రచారానికి.. పరస్పర ఆరోపణలకు సోషల్ మీడియా మంచి వేదికైంది. పైసా ఖర్చులేని వ్యవహారం కావడంతో కేడర్, అభిమానులు ఏ పోస్టులు పెట్టినా గో ఏ హెడ్ అన్నారట ఆ ఇద్దరు. కట్‌చేస్తే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు మరీ శ్రుతిమించిపోతున్నాయట. దీంతో ఒకప్పుడు సంబరపడిన నేతలే ఇప్పుడు ఆ సోషల్ మీడియా పోస్టులకు ఫీలవుతున్నారట. ఇంతకీ నేతలకు సోషల్ మీడియా తెచ్చిన తలనొప్పులేంటి? ఇద్దరికీ ఎన్నికల్లో ఉపయోగపడ్డ సోషల్…
శత్రువును దెబ్బతీయడానికి రాజకీయాలలో రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ప్రత్యర్థిపార్టీలే కాదు.. సొంత పార్టీ నేతలనూ.. ఇందుకు మినహాయింపు ఇవ్వట్లేదు ఓ నేత వర్గం. పట్టు నిలుపుకోవడానికి.. వర్గాన్ని కాపాడుకోవడానికి.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి.. ప్రత్యర్థి శిబిరాన్ని వీక్ చేసే పనిలో పడ్డారట. గుంటూరు పశ్చిమలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవలేరా? రాజకీయాల్లో సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు రాజకీయ నాయకులు. కలిసొచ్చే అంశాలను అస్సలు వదులుకోరు. కలిసిరాదన్నచోట కలవరపాటు కామన్. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆ సెంటిమెంటే…
గట్టిగా ఉన్నామని అనుకున్నచోట టీడీపీ నేతల లెక్కలు వర్కవుట్ కావడం లేదా? అంతా ఆరంభ శూరత్వమేనా? బలహీనతలు తెలిసీ నేల విడిచి సాము చేస్తున్నారా? కేడర్ వద్దని వారించినా పంతాలకు పోయి.. ఎందుకు పరాజయాలను మూట కట్టుకుంటున్నారు? అది ఎక్కడో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖలో కీలక అంశాల్లో టీడీపీ అభాసుపాలు! రాజకీయ చైతన్యానికి విశాఖ వేదిక. ఇక్కడ టీడీపీ కూడా గట్టిగానే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలోని నాలుగు ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ…
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొల్లిపర తీసుకు రావడంలో అర్థం ఏంటి. మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది. తప్పు చేస్తున్నారు కాబట్టి…