Adimulapu Suresh: రాజధాని వికేంద్రీకరణపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం అంటూ పాదయాత్ర చేస్తున్న వాళ్లు రైతుల్లా కనిపించటం లేదని ఆరోపించారు. ఓ అజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా వారు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఓ దురుద్దేశంతో చేయిస్తున్న పాదయాత్రలా కనిపిస్తోందని.. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని.. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్…
Roja Selvamani: తెలుగుదేశం పార్టీపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో ఫైరయ్యారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దుశ్శాసనుల పార్టీగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేత వేధింపుల వల్లే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని మంత్రి రోజా ఆగ్రహం…
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సీఎం జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ధర్మాన తెలిపారు. విశాఖ మన రాజధాని కావాలని, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమం చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు ఉద్యమంలోకి వెళ్లాలన్న ఆలోచన ఉందని.. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ధర్మాన స్పష్టం చేశారు. మరోవైపు అమరావతి రైతుల…
Karumuri Nageswara Rao: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సింహాం లాంటోడు అని.. ఎన్నికలకు సింగిల్గానే వెళ్తాడని స్పష్టం చేశారు. కేసీఆర్ కాదు కేసీఆర్ తాత వచ్చినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. అటు అమరావతి రైతుల పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. రిస్టు వాచీలు, బెంజ్ కారులు పెట్టుకున్న వాళ్ళు చేస్తున్న పాదయాత్ర అని మండిపడ్డారు. భార్యలు కాదు భర్తలు బయటకు వస్తే ముసుగు తొలగిపోతుందన్నారు. రైతుల…
Raghuveera Reddy: ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు దూరంగానే ఉంటానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ఆలయ నిర్మాణం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో తన యథాస్థితి కొనసాగుతుందన్నారు. అయితే అనంతపురం జిల్లాలో త్వరలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని రఘువీరారెడ్డి తెలిపారు. భారత్ జోడో…
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీని కాదని బామ్మర్ది షోకు వెళ్లారని ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు బామ్మర్ది షోకు వెళ్లగా.. సీఎం జగన్ మాత్రం జనంలోకి వెళ్తున్నారని తన ట్వీట్లో పేర్కొన్నారు. అందుకే ‘175 అన్స్టాపబుల్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ వ్యూహారచనలు చేస్తున్న సంగతి…
Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం…