Pawan Kalyan: అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటున్న వైసీపీ నేతల కామెంట్లపై మండిపడ్డారు. తనపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి లెక్కను తాను చెప్తానని తెలిపారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సంపాదించానని.. . రూ.33.37 కోట్ల…
Kakani Govardhan Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే పొలిటికల్ జోకర్‌గా మారారని అనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబుతో చేరడంతో పవన్ కళ్యాణ్‌కు కూడా మతిమరుపు వ్యాధి వచ్చినట్లుందన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ ప్యాకేజీల పవన్‌గా మారిపోయారని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష…
CM Jagan: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనకు,…
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా విశాఖ పర్యటనలోనే ఉన్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా నోవాటెల్ హోటల్లో పవన్ ఉండిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పార్టీ నేతలతో పలు మార్లు కీలకంగా మాట్లాడిన అనంతరం ఆయన సోమవారం మధ్యాహ్నం విశాఖ నుంచి విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన ప్రయాణించే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. హోటల్ వద్ద గుమికూడిన…
Pawan Kalyan: విశాఖ పర్యటనలో పోలీసుల ఆంక్షల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేయాల్సి ఉంది. అయితే సభలు, సమావేశానికి పోలీసులు…
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో విశాఖ ప్రధానమైన నగరం అని.. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే నగరం అని.. ఇలాంటి ప్రశాంతమైన నగరాన్ని అలజడి నగరంగా తయారైన పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారని.. రైతుల పాదయాత్ర పేరుతో విశాఖపై దాడి చేయించటానికి చంద్రబాబు ఓ వైపు ప్రయత్నం చేస్తున్నారని…
Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బాధాకరమన్నారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక నాయకులు. అధికారులతో సమస్యను తెలుసుకుని కలెక్టర్‌తో వరద పరిస్థితిపై సమీక్షించామని బాలకృష్ణ తెలిపారు. కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని…
Vidadala Rajini: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విడదల రజినీ స్పందించారు. జనసేన కార్యకర్తలు కావాలనే మంత్రులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎన్టీవీతో చెప్పారు. ఒకవేళ తాము జనవాణిని అడ్డుకోవాలని భావిస్తే ఇప్పటివరకు నాలుగు జనవాణిలు జరిగి ఉండేవి కావన్నారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్‌లో తాను ఇరవై నిమిషాలు ఇరుక్కుపోయానని.. జనసేన కార్యకర్తలు తన కారు చుట్టూ చేరి…