జనసేన అధినేత విమర్శలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్. పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చింది జనవాణి కోసం కాదు చంద్రబాబు బాణి కోసం వచ్చారని విమర్శించారు. ఇవాళ్టి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని స్పష్టమైంది. మంత్రుల మీద దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా..? పవన్ తీరు ఇదే విధంగా ఉంటే ఆయన్ను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి రావచ్చు. ఈ రాష్ట్రంలో ఇకపై రాజు మారడు. రాజు మారడు కాబట్టి రాజధాని మారుతుందని ఎవ్వరూ భావించనక్కర్లేదు. తలో చోట ఒక్కో పెళ్లాన్ని పెట్టుకున్న పవన్ మా గురించి మాట్లాడతారా..? గతంలో ప్రత్యేక హోదా కోసం పవన్ విశాఖ వచ్చినప్పుడు వాళ్ల ప్రభుత్వమే ఉంది.. ఆ విషయాన్ని పవన్ మరుస్తున్నారన్నారు మంత్రి అమర్నాథ్. అటు పవన్ విశాఖలో ఉన్నంతవరకు పెళ్లికాని ఆడపిల్లలు దయచేసి బయటికి రావొద్దని సూచించారు.
విజయవాడలో జనసేన నేతల నిరసన
విజయవాడ తుమ్మలపల్లి కలక్షేత్రం అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన తెలిపారు జనసేన నాయకులు. విశాఖపట్నం ఘటనకు సంబంధించి అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జనసేన నేత పోతిన మహేష్. విశాఖ గర్జన ఫెయిల్ అవ్వడంతో దృష్టి మరల్చడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.జనసేన కార్యకర్తలు తలుచుకుంటే వైసిపి మంత్రులు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టగలరా.?వైజాగ్ లో జనసేనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.అధికారంలో ఉండి గర్జన చేయడమే ఏంటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తీసివేయాలి. ఈ ఘటనకు కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. వైసీపీ మంత్రులు కేవలం గొడవ చేయడానికి విశాఖపట్నం వెళ్ళారని ఆయన ఆరోపించారు. మంత్రి రోజా కావాలని రెచ్చగొట్టే విధంగా నిన్న మాట్లాడారన్నారు మహేష్.
Read Also: Health Tips : మగవాళ్ళు“బొప్పాయి” పండు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా..?