James Anderson: “అలాంటి ప్లేయర్ ప్రపంచంలోనే లేడు”.. టీమిండియా బౌలర్‌పై ఆండర్సన్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
James Anderson: టీమిండియాలో ఒక బౌలర్ పేరు చెబితే ప్రపంచ క్రికెట్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆ బౌలర్ గురించి భారత్ ప్లేయర్సే కాదు ఇతర జట్ల ప్లేయర్స్ సైతం మెచ్చుకోక తప్పదు. ఇటీవల సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis) బుమ్రాను ఎంతలా పొగిడాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. తాజాగా టీ20 ఫైనల్‌కు ముంద టెస్టు క్రికెట్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. 600కు పైగా టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. బుమ్రాను “అబ్సల్యూట్ ఫ్రీక్” (అసాధారణ శక్తులున్న ఆటగాడు) అని అభివర్ణించాడు. సెమీస్‌లో బుమ్రా చేసిన మ్యాజిక్‌ను ఆండర్సన్ గుర్తు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో తన చివరి రెండు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా ప్రతిభను మెచ్చుకున్నాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన పోరులోనూ షిమ్రాన్ హెట్మెయర్, రోస్టన్ ఛేజ్‌లను ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపిన దూకుడుకు సలాం కొట్టాడు.
READ MORE: Iran War: “ట్రంప్‌ను వదిలిపెట్టం, మూల్యం చెల్లించుకోవాల్సిందే”.. ఇరాన్ బిగ్ వార్నింగ్..
Also Read
- Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
బీబీసీ పాడ్‌కాస్ట్‌లో ఆండర్సన్ మాట్లాడుతూ.. బుమ్రా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బుమ్రాను చూస్తే అతడికి ఇంకా కొత్తగా ఏం నేర్చుకోవడానికి ఏం లేదు అనిపిస్తుంది. అతడు ఓ అద్భుతం. ప్రపంచంలోనే ఏ ఫార్మాట్‌లోనైనా ఒక ఓవర్‌లో ఆరు యార్కర్లను కచ్చితత్వంతో వేయగల బౌలర్ మరొకరు లేరు. ఇంగ్లాండ్ మ్యాచ్‌లో బుమ్రా వేసిన యార్కర్స్ మామూలుగా లేవు. చివరి బాల్ స్లో యార్కర్ వేసి ఇంగ్లాండ్ బ్యాటర్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. బుమ్రా వేసిన బంతికి కొట్టడం ఎవరికైనా అసాధ్యమే అనిపిస్తుంది. బెతెల్, శామ్ కర్రాన్ వంటి బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్‌లో రిస్క్ తీసుకోకుండా వెనక్కి తగ్గారు. ఆ ఓవర్‌లో బౌండరీలు కొట్టడం అసాధ్యమని గ్రహించి జాగ్రత్త పడ్డారు. బుమ్రాను కాకుండా ఇతర టీమిండియా బౌలర్లపై దాడి చేశారు.” అని వెల్లడించాడు. చివరి ఓవర్‌లో దూబే 22 పరుగులు ఇచ్చిన విషయం తెలిసిందే. అంశంపై ఆండర్సన్ మాట్లాడుతూ.. యార్కర్లు వేయడం అందరికీ సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ఆ విద్యలో బుమ్రాను మించిన బౌలర్ ప్రస్తుత టీ20 క్రికెట్‌లో ఎవరూ లేరని స్పష్టం చేశాడు. ఆండర్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టీమిండియాలో కొత్త ఊపును తీసుకువచ్చాయి.
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!