Gudivada Amarnath: విశాఖలో ఈనెల 15న పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చీరలు, గాజులు పెట్టి పంపిస్తామన్న జనసేన నేతల వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ దగ్గర చీరలు, గాజులు బోలెడన్నీ మిగిలిపోయాయని.. అందుకే వాటిని ఏం చేయాలో తెలియడం లేదని చురకలు…
Botsa Satyanarayana: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు…
Nallapareddy Prasanna Kumar Reddy: అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను బాలయ్య ఇంటర్వ్యూ చేసిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి మానసికంగా చంద్రబాబు హత్య చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూకు…
Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసమానత కారణంగా ఉత్తరాంధ్రలో ఉన్న సంస్థలన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల వారివేనని వెల్లడించారు. ఒక ప్రాంతం నెగ్లెట్ కావడంతో తమ ప్రాంతం బీదవారిగా మారిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు ఏపీలో ఒక్క విశాఖలో మాత్రమే ఉన్నాయని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే…
Dadisetti Raja: ఈనెల 15 నుంచి ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రణాళికలో భాగంగానే…
GVL Narasimha Rao: విశాఖ భూముల విషయంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైసీపీ నుంచి సంతృప్తికర సమాధానం రావటం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడికి న్యాయం జరగకుండా సంపన్నులకు న్యాయం చేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్ ఎవరు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారని.. ఇదే అమర్నాథ్ గతంలో ఈ అంశంపై సీబీఐ విచారణ…
Pawan Kalyan: ఏపీలో వికేంద్రీకరణ ఉద్యమం ఊపందుకుంటున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు పవన్ ఉత్తరాంధ్ర జిల్లాలలో పలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారని సోమవారం సాయంత్రం జనసేన పార్టీ ప్రకటించింది. ఈ పర్యటనలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన పార్టీ నేతలు, పార్టీ వాలంటీర్లతో పవన్ సమావేశం కానున్నట్లు తెలిపింది. ఈనెల 16న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారని…
Kodali Nani: తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ మనుగడకు కాలమే సమాధానం చెప్పాలని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారేమోనని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలు కేసీఆర్‌ను వ్యతిరేకించారని.. అయితే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రా వాళ్లు టీఆర్ఎస్…
Botsa Satyanarayana: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వైసీపీ వికేంద్రీకరణ రాగం అందుకుందని టీడీపీ ఆరోపిస్తుంటే.. వికేంద్రీకరణ చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి విశాఖ…