Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీని కాదని బామ్మర్ది షోకు వెళ్లారని ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు బామ్మర్ది షోకు వెళ్లగా.. సీఎం జగన్ మాత్రం జనంలోకి వెళ్తున్నారని తన ట్వీట్లో పేర్కొన్నారు. అందుకే ‘175 అన్స్టాపబుల్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ వ్యూహారచనలు చేస్తున్న సంగతి…
Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం…
Chintamaneni Prabhakar: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర తాడేపల్లి గూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫేక్ రైతులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలను స్థానిక మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏర్పాటు చేయించారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహన లేమితో రాజధానిపై మూడు…
KVP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. కర్ణాటక సరిహద్దు మోక వద్ద ఏపీలో ప్రారంభం కానుంది. ఏపీలో నాలుగు రోజుల పాటు 90 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్ జోడో యాత్ర నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్…
Dharmana Prasad Rao: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు, మేధావులు, సామాజిక వేత్తలు హాజరయ్యారు. రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లాంటి రాజధాని నుంచి విడిపోయిన మనం దురదృష్టవంతులు అయ్యామని…
Minister Chelluboina: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్పై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారని.. రాజకీయాలు ఒక వికృత క్రీడగా మారిపోయాయని.. ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడటం అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను తక్షణమే గంగుల కమలాకర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.…