ఇవాళ ఏపీలో ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు ఇంటర్ రిజల్ట్ రిలీజ్.. వాట్సాప్ గవర్నెన్స్‌లో కూడా ఇంటర్ ఫలితాలు విడుదల నేడు తిరుపతిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. ఉదయం పది గంటలకు కచ్ఛపి ఆడిటోరియంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” సెమినార్ తిరుమలలో ఇవాళ తుంభూర తీర్ద ముక్కోటి.. ఉదయం 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ నేడు బెజవాడకు సీఎం చంద్రబాబు రాక.. మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి…
మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు: రాష్ట్ర ఎక్సైజ్, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా ఉన్న పి.రాజబాబును ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తొలగించింది. గనులశాఖపై ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. గత కొన్ని రోజులుగా రాజాబాబు ఆఫీసుకు కూడా హాజరుకావడం లేదు. ఓఎస్డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కొంతమంది మంత్రుల ఓఎస్డీలపై తీవ్ర అవినీతి ఆరోపణలు…
నేడు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం.. సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున జరగనున్న రాముల వారి కళ్యాణం ఇవాళ బెంగుళూరుకు వెళ్లనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ నేడు కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణోత్సవంలో పాల్గొననున్న సీఎం ఈరోజు విజయనగరంలో పర్యటించనున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి..…
నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నేడు సదుంలో ఎంపీ మిధున్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీడీవో ఆఫీసులో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. నేడు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పర్యటించనున్నారు. గావ్…
టీడీపీ-జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలు: ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్‌ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్‌ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపక్‌పై…
మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతి: లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. నాగాంజలి మృతదేహాన్ని కిమ్స్…
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీ కోసం నేడు మున్సిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళిక చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో…
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఇక, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయ పరుస్తున్నాం.. ప్రజలు ముందుకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక…
చంద్రగిరిలో ఉప ఎన్నికలు: రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం తిరుపతి…
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల జీతాల వ్యవహారం ఎట్నుంచి ఎటెటో తిరిగి ఎక్కడెక్కడికో పోతోందా? చివరికి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తీసుకున్న శాలరీ దగ్గరికి వచ్చి ఆగబోతోందా? ఆల్రెడీ ఆ విషయంలో వైసీపీ లీడర్స్ కూపీ లాగుతున్నారా? జీతం విషయంలో బాబుకు, జగన్‌కు పోలికపెట్టి వైసీపీ కొత్త రాజకీయానికి తెరలేపబోతోందా? అసలీ జీతాల గోలేంటి? వెనకున్న రాజకీయం ఏంటి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే…40…