రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ.. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తదితర ఇతర…
హోమ్ గార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై ఏపీ సీఐడీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సీఐడీ విభాగంలో 28 హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 నుండి 50…
నీటి కుంటలో మునిగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. మొలకలచెరువు మండల కేంద్రానికి చెందిన మల్లేష్ (36), అతని కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిషోర్ (10) కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోకి దిగిన నందకిషోర్, అతని స్నేహితురాలు నందిని నీటిలో మునిగిపోతుండగా.. అది చూసిన లావణ్య పెద్దగా కేకలు వేసింది. అంతేకాదు..
ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ నేడు కూడా వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను విచారించనున్న పోలీసులు.. చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నం ఘటనపై మాధవ్‌ను విచారించనున్న పోలీసులు లిక్కర్ స్కాంలో ఇవాళ కూడా అరెస్టులు జరిగే ఛాన్స్.. ఇప్పటికే ఏ1 రాజ్ కసి రెడ్డి, ఏ8 చాణక్యలను అరెస్టు చేసిన సిట్.. ఇవాళ మరొకరిని అరెస్టు చేయనున్న సిట్ నేడు రాయచోటి,…
ఏపీలో రోడ్లు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చే రహదారులను ఆయన పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు చెప్పారు. ప్రధాని…
వీరయ్య చౌదరి అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం: దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో…
నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. ఉదయం 10గంటలకు ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్న మంత్రి నారా లోకేశ్ నేడు రాయచోటి ప్రాంతంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన.. పలు కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు, రేపు వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను విచారించనున్న నగరంపాలెం పోలీసులు.. ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు…
మూడు ప్రధాన కాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేత: తూర్పుగోదావరి జిల్లా గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన కాలువలకు ఈరోజు అర్ధరాత్రి నుండి సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. దాంతో డెల్టా పరిధిలోని మూడు కాలువలు గురువారం ఉదయం నుండి మూసివేయనున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పది లక్షల 13వేల ఎకరాల వరి సాగుకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. రబీ పంటలు పూర్తయి కోతలకు రావడంతో సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు.…
నేడు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్న సీఎం ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగవ రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నేడు నిర్ణయం.. నామినేషన్ పత్రాల దాఖలుకు ఈ నెల 29వ తేదీ తుది గడువు ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ…
13 మంది భక్తులకు గాయాలు: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో వాలాల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. టైం స్లాట్ టోకెన్ తీయిస్తామంటూ రైల్వే స్టేషన్ వద్ద భక్తులకు ఎక్కించుకుని వేగంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమయం ముగిస్తే భక్తుల వద్ద తీసుకున్న డబ్బులు రిటన్ ఇవ్వాల్సి వస్తుందనే అలోచనతో ఓ ఆటో డ్రైవర్ ఒవర్ టేక్ చేసే సమయంలో ముందున్న జీపును డీకోట్టాడు. దీంతో ఆటోలొ ప్రయాణిస్తున్న…