శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని తెలిపారు. చందక దేవుడు బుడితిలో పాస్టర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 9:30 నుంచి 11 మధ్య రెక్కీ నిర్వహించారని.. బైక్స్ పెయింట్ చేయటానికి ఉపయోగించే పెయింట్ తో రాశారని వెల్లడించారు.
“అజయ్, ఈశ్వర్ రావు జాన్ పీటర్ అనే పాస్టర్ ప్రోద్బలంతో చేశారు.. యలమంచిలి లో కొత్త చర్చ కట్టేందుకు ప్లాన్ చేశారు.. దాన్ని అడ్డుకునేందుకు ఈ విధంగా చేశారు.. చర్చి కట్టేందుకు ఉన్న ల్యాండ్ దగ్గర క్రాస్ సింబల్ వేశారు.. ముగ్గురు కావాలనే చర్చ నిర్మాణాన్ని ఆపేందుకు ఇలా చేశారు.. మత ఘర్షణలకు ఎవరు ఎంకరేజ్ చేయకూడదు.. అలా చేస్తే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. టెంపుల్స్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం వలన కేసు చేదించడం లేట్ అయింది.. ప్రతి గుడి, చర్చ, మసీదుల దగ్గర ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.” అని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: Rahul Gandhi: రాజస్థాన్ పర్యటనలో రాహుల్‌గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!