విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటలలో డెలివరీ కావలసిన భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. మనస్పర్థలు కారణంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ తలెత్తింది. రెండు ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. ఈ అంశంపై తాజాగా ఆమె స్నేహితులు కీలక విషయాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం సింహాచలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. మృతురాలు అనూష తండ్రి చనిపోయారు, తల్లికి ఆరోగ్యం బాగోలేక మూడేళ్లగా కోమాలో ఉందన్నారు.
READ MORE: Kaushik Reddy: గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
“జ్ఞానేశ్వర్ అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు.. భార్యను బయటకు ఎక్కడికి తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదు. జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు. గతంలో కూడా పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు.. ఫలుదాలో ఓసారి టాబ్లెట్స్ కలిపి చంపాలి అనుకున్నాడు.. మాకు సమాచారం వచ్చి వెళ్లే చూసే సరికి బెడ్ మీద విగత జీవిగా పడి ఉంది.. ఈ రోజు డెలివరీ ఉందని నిన్న ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేసింది.. రాత్రికి రాత్రి చున్నీతో గొంతు బిగించి చంపేశాడు. భర్త జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నాయి..” అని బాధితురాలి స్నేహితులు వెల్లడించారు.
READ MORE: Kaushik Reddy: గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు