చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజ వెంట పంపించారు.
READ MORE: Visakhapatnam: 24 గంటలలో డెలివరీ కావలసిన గర్భిణిని.. దారుణంగా చంపిన భర్త
నిన్న తండ్రికి సీరియస్ గా ఉందని భాను పుట్టింటికి వచ్చింది. కూతుర్ని చూసి ఆవేశానికి గురైన షౌకత్ అలీ ఆమెను తన పరువు తీశావంటూ మందలించారు. అనంతరం అలీ ఇంటి నుంచి వెళ్లిపోయాడని అందుకే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని యాస్మిన్ తల్లి స్టేట్మెంట్‌లో పేర్కొంది. యువతి మృతిపై భర్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఊరి వేసుకున్న ఆనవాలు ఇంట్లో లేవంటూ, పైగా ఆస్పత్రి వరకు గోప్యత పాటించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా యాస్మిన్ తండ్రి, ఆమెను భర్త ఇంటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లిన బంధువులు పరారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో యాస్మిన్ తల్లి ఉంది. యాస్మిన్ తండ్రి, బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
READ MORE: Minister Satya Kumar: అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు నెహ్రూ, ఇందిరా గాంధీ నిరాకరించారు..