నేడు అల్లూరి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన.. అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించినున్న మంత్రి సంధ్యారాణి నేడు సిట్ విచారణకు మరోసారి రానున్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి.. సోమవారం సిట్ విచారణకు రావాలని ఉపేంద్ర రెడ్డికి సిట్ పిలుపు.. ఇప్పటికే రెండు రోజులు ఉపేంద్ర రెడ్డిని విచారించిన సిట్ ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 బెంగుళూరు నుంచి…
టీటీడీ ఈవో బంగ్లాలో దూరిన నాగుపాము: తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో గురువారం రాత్రి ఓ భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గొనె సంచెలో వేస్తుండగా.. రవీందర్ నాయుడు చేతిపై కాటు వేసింది. సిబ్బంది అతడిని హుటాహుటిన స్విమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉంది. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు:…
ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు: తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, నవాజ్ బాషాలు ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి శాసనసభ్యులు కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని…
గోశాలకు వెళ్లేందుకు భూమనకు పోలీసుల అనుమతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. టీడీపీ ఛాలెంజ్‌ను భూమన స్వీకరించారు. గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. గోశాలకు వెళ్లేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు పోలీసుల అనుమతి లభించింది. మరికొద్దిసేపట్లో ఆయన గోశాలకు బయల్దేరనున్నారు. ఈరోజు ఉదయం భూమన…
మద్యం కేసులో నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఉదయం 10 గంటలకు విచారణకు రానున్న విజయసాయి రెడ్డి ఉదయం పది గంటలకు తిరుపతి ఎస్వీ గోశాలకు టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి.. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాసం కోసం కౌంట్‌డౌన్.. నేడు కార్పొరేటర్లకు విప్ జారీ చేయనున్న వైసీపీ.. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి…
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని…
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటలలో డెలివరీ కావలసిన భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. మనస్పర్థలు కారణంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ తలెత్తింది. రెండు ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. ఈ అంశంపై తాజాగా ఆమె స్నేహితుడు కీలక విషయాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం సింహాచలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. మృతురాలు అనూష తండ్రి చనిపోయారు, తల్లికి…
చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజ…
నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్: నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీకైంది. వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ భారీగా వ్యాపించింది. అమోనియా గ్యాస్ లీక్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.…