నేడు అల్లూరి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన.. అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించినున్న మంత్రి సంధ్యారాణి
నేడు సిట్ విచారణకు మరోసారి రానున్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి.. సోమవారం సిట్ విచారణకు రావాలని ఉపేంద్ర రెడ్డికి సిట్ పిలుపు.. ఇప్పటికే రెండు రోజులు ఉపేంద్ర రెడ్డిని విచారించిన సిట్
ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 బెంగుళూరు నుంచి బయలుదేరనున్న జగన్.. సాయంత్రం 5.30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం.. హాజరుకానున్న పలువురు ముఖ్య నేతలు
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సుప్రీంకోర్టు మాజీ సిజేఐ ఎన్వి రమణ
నేడు రాజమండ్రిలో జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.. ఉదయం 11 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, కూటమీ నేతలతో సమావేశం
నేడు శ్రీశైలంలో సోమవారం వారాంతపు సేవలలో భాగంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని పంచాయతీల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశం.. పాల్గొననున్న మంత్రి సవిత
నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం.. అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చ.. ఇప్పటికే మోడీ టూర్‌పై ఉన్నతాధికారుల కసరత్తు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం జపాన్ పర్యటన.. నేడు యుమెషిమాలో వరల్డ్ ఎక్స్ఫో, తెలంగాణ పెవిలియన్ ప్రారంభం.. బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం, ఒసాకా రివర్ ఫ్రంట్ సందర్శన మరియు అసెంబ్లీ చైర్మన్‌తో సమావేశాలు
నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క.. మల్లంపల్లి మండలం కేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొననున్న మంత్రి
నల్లగొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సు.. సదస్సుకు హాజరు కానున్న రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నేడు నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ పర్యటన.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రాష్ట్ర రైతు మహోత్సవం ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి
నేడు ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళాను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నేడు భద్రాచలంలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత.. జాగృతి కార్యకర్తలతో సమావేశం
నేడు భారత్‌కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా చిలుకూరి.. భారత్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న జేడీ వాన్స్.. స్వదేశానికి సెకండ్ లేడీ హోదాలో తెలుగమ్మాయి ఉషా.. ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. కోల్‌కతాలో మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం