మద్యం కేసులో నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఉదయం 10 గంటలకు విచారణకు రానున్న విజయసాయి రెడ్డి
ఉదయం పది గంటలకు తిరుపతి ఎస్వీ గోశాలకు టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి.. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన
గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాసం కోసం కౌంట్‌డౌన్.. నేడు కార్పొరేటర్లకు విప్ జారీ చేయనున్న వైసీపీ.. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరుకావొద్దని నిర్దేశం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామి వారి మూల బృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు
ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్.. కంచ గచ్చిబౌలి భూములపై మాట్లాడనున్న కేటీఆర్
నేడు ఉదయం 10.30 గంటలకు తెలంగాణ మానవ హక్కుల కమీషన్ చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించనున్న మాజీ జస్టిస్ షమీమ్ అక్తర్
నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం.. నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు.. భూ భారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట.. భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరణ
నేడు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై ఆలయ గెస్ట్ హౌస్‌లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం
నేడు హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్.. చేవెళ్ల, నిజామాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలపై మీనాక్షి నటరాజన్ సమీక్ష
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.. వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ఆరంభం కానుంది