Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.. కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది హైకోర్టు.. కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు విచారించిన ఏపీ హైకోర్టు .. తెల్లారాయి అక్రమ రవాణాకి సహకరిచటంతో పాటు ఎస్సీ ఎస్టీ కేసును కాకాణిపై నమోదు చేశారు పొదలకూరు పోలీసులు.. అయితే, కాకాణి పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు అడ్వొకట్ జనరల్.. ఎస్సీ ఎస్టీ కేసులో మొదట స్పెషల్ కోర్టు కి వెళ్ళాలన్న ఏజీ.. కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు.. మొదట స్పెషల్ కోర్టు రిజెక్ట్ లేదా రిటర్న్ చేస్తే మాత్రమే హైకోర్టులో పిటిషన్ వేయాలి అంటుంది ప్రభుత్వం.. గతంలో పలు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ లు ఈ సందర్భంగా ఏజీ ఉదాహరించారు..
Read Also: Arjun S/O Vyjayanthi: ‘అర్జున్’గాడు దిగుతున్నాడు..ఎప్పుడంటే?
అయితే, స్పెషల్ కోర్టులకు వెళ్లకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసే వెసులుబాటు ఉందని కోర్టుకి తెలిపారు కాకాణి.. సెక్షన్ 18 కేసులో నమోదు చేశారని అది ఉంటే సెక్షన్ 14 అప్లికబుల్ కాదని కోర్టుకు తెలిపారు కాకాణి లాయర్.. ఈ కేసు విషయంలో స్పెషల్ కోర్టు పరిధి కంటే హై కోర్టుకి పరిధి, పవర్ ఎక్కువ ఉన్నాయన్న కాకాణి తరఫు లాయర్ వాధించారు.. కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు.. పిటిషన్ విచారణ అర్హత తర్వాత మెరిట్స్ మీద విచారణ చేస్తామన్న కోర్టు.. తెల్లారాయి అక్రమ మైనింగ్ ప్రభుత్వానికి చెందిన 32 ఎకరాల్లో వేరే వ్యక్తులు చేస్తున్నారని, దానికి కాకాణికి సంబంధం లేదన్నారు.. 2016లో లీజు సమయం ముగిసిందని అప్పటి నుంచి ఇది జరుగుతున్నట్టు కోర్టు దృష్టికి తెచ్చిన లాయర్.. అయితే, అప్పటి నుంచి మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది.. స్థానికంగా నివసిస్తున్న వారిపై కులం పేరుతో తిట్టారనేది కేవలం ఆరోపణ మాత్రమే అని పేర్కొన్నారు.. ఇక, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.. ఈలోపు తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కాకాణి లాయర్ కోరగా నిరాకరించింది.