Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు.. తనపై వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో నమోదైన కేసులను క్వాష్ చేశాయంటూ పిటిషన్ వేశారు.. అయితే, పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ల మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 35 BNS ప్రొసీజర్ ఫాలో కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. అయితే, ఈ కేసుల్లో పీటీ వారెంట్లు ఇంకా అమలు చేయలేదని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీంతో, నాలుగు పిటిషన్లు డిస్పోజ్ చేసింది న్యాయస్థానం.. అయితే, కర్నూలు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. ఆ కేసు క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు వెల్లడించిన హైకోర్టు.. 35 BNS ప్రొసీజర్ ఫాలో కావాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా, పోసాని కృష్ణ మురళిని వరుసగా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. ఫిర్యాదులు, పీటీ వారెంట్లు, అరెస్ట్‌లు, జైలు జీవితం, పోలీసుల విచారణ, పోలీసు కస్టడీ.. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఈ నేపథ్యంలో.. కేసులను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
Read Also: Test : డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న నయనతార లేటెస్ట్ మూవీ.. !