ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ఈ క్రమంలో.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ.. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి.. ఇప్పటి వరకు ఈ కేసులో A2గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజ నేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు..
సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ హత్య జరిగిన 18 ఏళ్లకు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం..
హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం..తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. అయితే, దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది హైకోర్టు.. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్లో హెల్మెట్ల తప్పనిసరిగా ధరించటాన్ని పోలీసులు అమలు చేయకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవటంలేదని.. అసలు పట్టించుకోవడంలేదన్నారు న్యాయమూర్తి.. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 667 మంది హెల్మెట్ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మఫై ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు, అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించ పరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో పాటు సినిమాలు తెరక్కించాడు ఆర్జీవీ. Also Read : Manchu Family : మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్.. పోరాటం ఆగదు ఈ…
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగించింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను మళ్లీ శుక్రవారం వరకు పొడిగిస్తూ ఆదేశాలిచింది.. ఇక, ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.. అయితే, జత్వాని కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ .. ఇక, హైకోర్టులో జత్వానీ, పోలీసుల తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు.. బెయిల్ మంజూరు చేస్తే…
ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్.. అయితే, బాధితురాలు తరపున వాదనలు వినిపించారు పీపీ లక్ష్మీనారాయణ, న్యాయవాది నర్రా శ్రీనివాస్.. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని.. బాధితురాలు జత్వానీ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీనారాయణ…
గత కొద్ది రోజులుగా రాంగోపాల్ వర్మ కొన్ని కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో వ్యూహం సినిమా రిలీజ్ చేసిన సమయంలో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నారా లోకేష్ ల ఫోటోల మార్ఫింగ్ ట్వీట్లను ఉద్దేశిస్తూ ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులైతే వర్మను అరెస్ట్ చేసేందుకు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో…