Kadapa Zilla Parishad Chairman Election: ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది.. జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ నెల 27న జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీగా ఉన్న 2 స్థానాలకు ఎన్నికలు జరపకుండా చైర్మన్ ఎన్నిక జరపడం వల్ల తాను నష్టపోతున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో పోటీ చేయనున్నానని.. ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల తనకు నష్టం జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. యూరోపియన్ దేశం నిర్ధారణ
ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా, జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆయన సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ను వాయిదా వేయాలని అందులో పేర్కొన్నారు. టీడీపీ జడ్పీ చైర్మన్ రేస్ లో లేదని అంటూనే మరో ప్రక్క టీడీపీ జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంపై మరోమారు ఉత్కంఠ నెలకొంది. అయితే, టీడీపీ జడ్పీటీసీ జయరాం రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..